ఈ సారి పవన్ అభిమానిగా..! | Nani has set his eyes on Power Star Pawan Kalyan | Sakshi
Sakshi News home page

ఈ సారి పవన్ అభిమానిగా..!

Jun 14 2016 12:15 PM | Updated on Mar 22 2019 5:33 PM

వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని ఈ శుక్రవారం జెంటిల్మేన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో మంచి...

వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని ఈ శుక్రవారం జెంటిల్మేన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో మంచి హిట్ అందుకున్న నాని ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపించాడు.  చేతి మీద జై బాలయ్య టాటూతో కనిపించిన నాని, ఎంతోమంది నందమూరి అభిమానులు ఆ టాటూ వేయించుకోవడానికి కారణమయ్యాడు.

అయితే ఈ సినిమాలో బాలయ్య పేరు వాడుకోవటం నానికి కూడా బాగానే కలిసొచ్చింది. నందమూరి అభిమానుల సాఫ్ట్ కార్నర్తో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. దీంతో తన నెక్ట్స్ సినిమాకు మరో స్టార్ హీరో పేరును వాడుకోవడానికి రెడీ అవుతున్నాడు నాని. ఇప్పటికే యంగ్ హీరో నితిన్ తన ప్రతీ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు జపిస్తూ పవర్ స్టార్ అభిమానులను బుట్టలో వేసుకుంటున్నాడు. ఇప్పుడు అదే పేరును వాడుకోవడానికి రెడీ అవుతున్నాడు నాని.

గతంలో బాలయ్య అభిమానిగా నటించిన నాని, ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పవన్ కళ్యాణ్ అభిమానిగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా జెంటిల్మేన్ రిలీజ్ తరువాత సెట్ మీదకు వెళుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement