నాని దర్శకత్వంలో బాహుబలి | Nani directs Baahubali scene | Sakshi
Sakshi News home page

నాని దర్శకత్వంలో బాహుబలి

Jun 23 2016 11:05 AM | Updated on Jul 14 2019 4:05 PM

నాని దర్శకత్వంలో బాహుబలి - Sakshi

నాని దర్శకత్వంలో బాహుబలి

బాహుబలి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నాని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్గా మారింది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేయాల్సిన సినిమాకు నాని దర్శకత్వం...

బాహుబలి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నాని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్గా మారింది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేయాల్సిన సినిమాకు నాని దర్శకత్వం వహించటం ఏంటి అనుకుంటున్నారా..?  ప్రస్తుతం జెంటిల్మన్ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న నాని, బాహుబలి సెట్స్లో సందడి చేశాడు.

హీరో నానికి ఈ జనరేషన్ హీరోలతో మంచి రిలేషన్ ఉంది. ముఖ్యంగా రానా ఏర్పాటుచేసే పార్టీల్లో నాని తప్పకుండా కనిపిస్తుంటాడు. బాహుబలి దర్శకుడు రాజమౌళితో కూడా నానికి మంచి అనుబంధం ఉంది. ఈగ సినిమాతో తనకు జాతీయస్థాయి గుర్తింపు ఇచ్చినందుకు జక్కన్నకు ఎప్పుడూ కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉన్నాడు నాని.

అందుకే అంత ఈజీగా ఎవరికీ అనుమతి లభించని బాహుబలి సెట్లో అడుగుపెట్టే అదృష్టాన్ని పొందాడు నాని. అంతేకాదు కాసేపు హీరో వేషాలు పక్కన పెట్టి రాజమౌళి చేతిలో మెగాఫోన్ అందుకొని దర్శకుడి అవతారం ఎత్తేశాడు. బాహుబలి సెట్స్లో నాని చేసిన హడావుడిని చిత్రయూనిట్ ట్విట్టర్ లో షేర్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement