ఎంత బాగుందంటే.. ఎంత బాగుందో చెప్పలేనంత! | Nani Comment On Mahanati Movie | Sakshi
Sakshi News home page

May 11 2018 11:10 AM | Updated on May 11 2018 11:15 AM

Nani Comment On Mahanati Movie - Sakshi

మహానటి విడుదలైనప్పటి నుంచి సినీ ప్రముఖులు ప్రశంసల జల్లులు కురిపిస్తూనే ఉన్నారు. విమర్శకులు సైతం ఈ సినిమాలో లోపాలు చూపెట్టలోకపోతున్నారు. రివ్యూలు కూడా ‘మహానటి’  సినిమాను సావిత్రికి ఘన నివాళిగా పేర్కొన్నాయి. ఇదొక క్లాసిక్‌ సినిమా, మహానటి సావిత్రి సినీ చరిత్రలో ఎలా నిలిచిఉంటుందో.. ఈ ‘మహానటి’ కూడా సినీ చరిత్రలో నిలిచి ఉంటుందని సినీ అభిమానులు అంటున్నారు. 

తాజాగా మహానటిపై నాని స్పందిస్తూ.. ఎంత బాగుంది అంటే.. ఎంత బాగుందో చెప్పలేనంత అంటూ తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు. ‘కీర్తి సురేశ్‌ తప్ప మరెవ్వరూ సావిత్రి గారి పాత్రను ఇంత బాగా పోషించలేరు. నాగి (డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌) ని చూస్తే గర్వంగా ఉంది. స్వప్నా, ప్రియాంక, దుల్కర్‌, సామ్‌, విజయ్‌, డాని, మిక్కిజే అందరికీ ధన్యవాదాలు’అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement