నాని నిర్మాణంలో యంగ్ హీరో | Nani Announced His Second Movie As A Producer | Sakshi
Sakshi News home page

నాని నిర్మాణంలో యంగ్ హీరో

May 28 2019 10:51 AM | Updated on May 28 2019 10:51 AM

Nani Announced His Second Movie As A Producer - Sakshi

టాలీవుడ్‌లో మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నేచురల్‌ స్టార్ నాని, నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. వాల్‌ పోస్టర్‌ సినిమా అనే బ్యానర్‌ను స్థాపించి ‘అ!’ సినిమాను నిర్మించిన నాని.. అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. అయితే అ! సినిమా కమర్షియల్‌గా సక్సెస్‌ కాకపోవటంతో వెంటనే మరో సినిమాను నిర్మించలేదు.

కాస్త గ్యాప్‌ తరువాత మరో చిత్రాన్ని నిర్మిస్తున్నట్టుగా ప్రకటించాడు నాని. విశ్వక్సేన్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఫలక్‌నామా దాస్‌ ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా వచ్చిన నాని నిర్మాతగా తన రెండో సినిమాను ప్రకటించాడు. విశ్వక్సేన్‌ తో తన బ్యానర్‌లో రెండో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఈ సినిమాలో విశ్వక్‌ కేవలం హీరోగా నటిస్తాడా లేక దర్శకత్వం కూడా తానే చేస్తాడా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement