‘నా కథలా కూడా అనిపిస్తుంది’ | Nani About Needi Naadi Oke Katha | Sakshi
Sakshi News home page

Mar 22 2018 5:12 PM | Updated on Mar 22 2018 6:55 PM

Nani About Needi Naadi Oke Katha - Sakshi

హీరో నాని

యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం నీదీ నాదీ ఒకే కథ. మధ్య తరగతి మనుషుల జీవితం కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్‌  వచ్చింది. ఇటీవల సినీ ప్రముఖుల కోసం స్పెషల్‌ ప్రీమియర్‌ను నిర్వహించారు చిత్రయూనిట్. ఈ షో చూసిన దర్శకుడు శేఖర్‌ కమ‍్ముల చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు.

తాజాగా యంగ్ హీరో నాని కూడా ఈ సినిమాపై స్పందించారు. సినిమా ట్రైలర్‌ను తన సోషల్‌ మీడియా పేజ్‌ లో పోస్ట్ చేసిన నాని... ‘ఇది నా కథలా కూడా అనిపిస్తుంది. శ్రీ విష్ణు నటనలో అతను ఎంత మనసుపెట్టి పర్ఫామ్‌ చేశాడో తెలుస్తోంది. అతనికి అతని టీంకు నా శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు నాని.

Advertisement
 
Advertisement
Advertisement