అరుదైన అక్షర | Nandita swetha akshara movie shooting completed | Sakshi
Sakshi News home page

అరుదైన అక్షర

Sep 6 2019 6:33 AM | Updated on Sep 6 2019 6:33 AM

Nandita swetha akshara movie shooting completed - Sakshi

నందితా శ్వేత

నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అక్షర’. బి. చిన్నికృష్ణ దర్శకత్వం వహించారు. సినిమా హాల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సురేష్‌ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ చక్కని పరిష్కారాన్ని ఇచ్చేలా రూపొందించిన చిత్రమిది. వాణిజ్య అంశాలు తగ్గకుండానే మంచి సందేశంతో ఉంటుంది. నందితా శ్వేత పాత్ర ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

గతంలో విడుదల చేసిన టీజర్, పాటకు వచ్చిన స్పందన సినిమా విజయంపై మా నమ్మకాన్ని రెట్టింపు చేసింది. అక్టోబర్‌ ద్వితీయార్ధంలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘అక్షర’ సినిమా చాలా బాగా వచ్చింది. ఇలాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకు థ్యాంక్స్‌. మా ‘అక్షర’ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు బి. చిన్నికృష్ణ. ఈ చిత్రానికి కెమెరా: నగేష్‌ బెనల్, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, లైన్‌ ప్రొడ్యూసర్స్‌: గంగాధర్, రాజు ఓలేటి, సహ నిర్మాతలు: కె.శ్రీనివాస రెడ్డి, సుమంత్‌.

Advertisement
 
Advertisement
Advertisement