బిగ్‌బాస్‌ : కన్నీటి పర్యంతమైన నందిని..

Nandini Was Cried In Bigg Boss 2 Telugu - Sakshi

ఆరో వారం బిగ్‌బాస్‌ షో సరదాగా సాగిపోతోంది. బిగ్‌బాస్‌ ఆదేశం మేరకు ఇంటి సభ్యులంతా కలిసి తెరకెక్కించిన సినిమాకు ప్రశంసలు దక్కాయి. సినిమాను అద్భుతంగా తెరకెక్కించినందుకు బిగ్‌బాస్‌ నిర్మాత బాబు గోగినేని, దర్శకుడు అమిత్‌కు కొంత డబ్బును ఇవ్వగా... దానిని సినిమా కోసం పనిచేసిన మిగతా బృందానికి నటీనటులు, సాంకేతిక బృందానికి తగిన పారితోషకం ఇవ్వాల్సిందిగా వారిని ఆదేశించారు. సభ్యులందరిలో ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వారే విజేతలని బిగ్‌బాస్‌ చెప్పగా.. ఎక్కువ మొత్తంలో డబ్బు ఉన్న బాబు గోగినేని, తనీష్‌, అమిత్‌లను ఈ వారం కెప్టెన్సీ పోటీకి అర్హులుగా ప్రకటించారు. 

కెప్టెన్‌గా తనీష్‌.. 
టమాటలను తొక్కుతూ.. వాటి నుంచి జ్యూస్‌ తీయాలని టాస్క్‌ను ఇవ్వగా.. ఎవరు ఎక్కువ రసం తీస్తే వారే విజేతలని బిగ్‌బాస్‌ తెలిపాడు. ఈ టాస్క్‌లో ఎవరైనా ఒక ఇంటి సభ్యుడి సహాయం తీసుకోవచ్చు అని చెప్పగా...అమిత్‌.. రోల్‌ రైడా, బాబు గోగినేని.. తేజస్వీ, తనీష్‌.. సామ్రాట్‌ల సహాయాన్ని తీసుకొన్నారు. ఈ టాస్క్‌లో తనీష్‌ చురుగ్గా పాల్గొనగా.. ఎక్కువ రసాన్ని తీసి కెప్టెన్‌గా బాధ్యతను తీసుకున్నారు. 

బిగ్‌బాస్‌ ఏర్పాటుచేసిన క్విజ్‌పోటీలు..
ఈ క్విజ్‌పోటీల్లో.. ఇచ్చిన స్టేట్‌మేంట్‌లు ఇంటిసభ్యుల్లో ఎవరికి సరిపోతుందో.. సరైన సమాధానం చెబితే వారికిష్టమైన ఫుడ్‌ను బిగ్‌బాస్‌ అందిస్తాడు. మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు.. అన్న దానికి సమాధానంగా ఇంటి సభ్యులు నందిని పేరును సజెస్ట్‌ చేయగా.. సరైన సమాధానమంటూ నందినికీ ఇష్టమైన ఫుడ్‌ను ఇచ్చాడు. ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసు.. కానీ బిగ్‌బాస్‌ హౌజ్‌ గురించి తెలియదు అనే ప్రశ్నకు బాబు గోగినేని పేరును చెప్పారు. కొండంత మనిషి.. కానీ మనసు వెన్న అనే దానికి అమిత్‌.. అసలు దాన్ని వదిలేసి కొసరును పట్టుకుని వేలాడుతుంది అనే దానికి గీతా మాధురి, ప్రేమ పూజారి అనే దానికి తనీష్‌, కొంచెం మంచి కొంచెం చెడుగా కౌశల్‌, ఎలిమినేషన్‌ అంటే భయపడే వ్యక్తిగా దీప్తి, లడ్డుబాబుగా గణేష్‌, అలరిస్తూ..ఆనందించే వాడుగా రోల్‌ రైడా, చిన్నదానిలా వచ్చి ఘాటు మిర్చిగా మారింది అనే  దానికి దీప్తి సునయన పేర్లను కరెక్ట్‌గా చెప్పిన ఇంటి సభ్యులు సామ్రాట్‌, తేజస్వీ విషయాల్లో సరైన సమాధానాలు చెప్పలేకపోయారు.

కన్నీరు పెట్టిన నందిని..
మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్టవిప్పి చూడ పురుగులుండు అనే స్టేట్‌మేంట్‌ తనకు ఇచ్చినందుకు నందిని రాయ్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటి సభ్యులందరూ ఓదార్చసాగారు. ఇంటి సభ్యులకు స్టేట్‌మెంట్స్‌ను ఊరికే ఇవ్వలేదని.. ఇంట్లో సభ్యులు ప్రవర్తించే తీరును గమనించే ఇచ్చాడని సోషల్‌ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top