నిన్నే.. నన్నే.. నా ఫేవ రెట్స్ | Nandini Nursing Home Movie Release on 21st | Sakshi
Sakshi News home page

నిన్నే.. నన్నే.. నా ఫేవ రెట్స్

Oct 16 2016 11:34 PM | Updated on Sep 4 2017 5:25 PM

నిన్నే.. నన్నే.. నా ఫేవ రెట్స్

నిన్నే.. నన్నే.. నా ఫేవ రెట్స్

‘‘సంగీత దర్శకుడు అచ్చు ఏడేళ్లుగా తెలుసు. మోస్ట్ టాలెంటెడ్. నేను ఊహించినట్టే మంచి సాంగ్స్ ఇచ్చాడు.

‘‘సంగీత దర్శకుడు అచ్చు ఏడేళ్లుగా తెలుసు. మోస్ట్ టాలెంటెడ్. నేను ఊహించినట్టే మంచి సాంగ్స్ ఇచ్చాడు. ‘నిన్నే..’, ‘నన్నే నన్నే..’ నా ఫేవరెట్ సాంగ్స్’’ అన్నారు నవీన్ విజయకృష్ణ. ఆయన హీరోగా పీవీ గిరి దర్శకత్వంలో సంగం బిక్షమయ్య, జి.రాధాకిశోర్ నిర్మించిన ‘నందిని నర్సింగ్ హోమ్’ ఈ నెల 21న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ఆడియో సక్సెస్‌మీట్ నిర్వహించారు.

‘‘ఎడిటర్‌గా మంచి పేరు తెచ్చుకున్న మా అబ్బాయి నవీన్, ఈ సినిమాతో హీరోగానూ మంచి పేరు తెచ్చుకుంటాడనే నమ్మకముంది. మంచి కథ, అచ్చు మంచి సంగీతం ఇచ్చాడు. నిర్మాతలు రాజీ పడకుండా సినిమా తీశారు’’ అన్నారు సీనియర్ నరేశ్. పాటలకు వస్తోన్న స్పందన పట్ల దర్శక-నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. హీరోయిన్లు నిత్యా నరేశ్, శ్రావ్య, పాటల రచయిత రెహమాన్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement