'లెజెండ్' ఫస్ట్ లుక్ | Nandamuri Balakrishna Legend movie First Look Release | Sakshi
Sakshi News home page

'లెజెండ్' ఫస్ట్ లుక్

Dec 31 2013 7:58 PM | Updated on Aug 29 2018 1:59 PM

'చూడూ.. ఒకవైపే చూడూ.. రెండోవైపు చూడాలనుకోకూ... మాడిపోతావ్' అంటూ 'సింహా'లో గర్జించిన నట సింహం మరోసారి తెలుగు తెరపై దుమ్ము రేపేందుకు సిద్ధమవుతోంది.

'చూడూ.. ఒకవైపే చూడూ.. రెండోవైపు చూడాలనుకోకూ... మాడిపోతావ్' అంటూ 'సింహా'లో గర్జించిన నట సింహం మరోసారి తెలుగు తెరపై దుమ్ము రేపేందుకు సిద్ధమవుతోంది. నందమూరి నట వారసుడు ఈసారి 'లెజెండ్'గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన 'లెజెండ్' ఫస్ట్ లుక్ విడుదలయింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దీన్ని విడుదల చేశారు.

బాలకృష్ణ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఇది ఉంది. తెల్లటి పొడుగు చేతుల ఖద్దరు చొక్కా, నలుపు రంగు జీన్స్ ఫ్యాంటు ధరించి నడిచొచ్చే సింహంలా బాలయ్య ఉన్నాడు. మెలితిప్పిన మీసాలు, మెడలో రుద్రక్షమాలతో ఉన్న బాలయ్య ప్రత్యేకంగా తయారు చేసిన కారు ముందు గంభీరంగా నించుని ఉన్న ఫోటో అభిమానులకు కనువిందు చేస్తోంది. 'లెజెండ్'లో బాలయ్య పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఫస్ట్ లుక్‌ని చూస్తే అర్థమయిపోతుంది. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement