కాంబినేషన్‌ రిపీట్‌ | Nandamuri Balakrishna, KS Ravi Kumar, C Kalyan Movie Launch | Sakshi
Sakshi News home page

కాంబినేషన్‌ రిపీట్‌

Jun 14 2019 12:44 AM | Updated on Jun 14 2019 12:44 AM

Nandamuri Balakrishna, KS Ravi Kumar, C Kalyan Movie Launch - Sakshi

బాలకృష్ణ, వీవీ వినాయక్‌

బాలకృష్ణ–కె.ఎస్‌.రవికుమార్‌– సి.కల్యాణ్‌ కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ అవుతోంది. బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ నిర్మించిన ‘జై సింహా’ సినిమా గత ఏడాది జనవరిలో విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ ముగ్గురి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న నూతన చిత్రం గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు.

ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్‌ క్లాప్‌ ఇచ్చారు. సీనియర్‌ దర్శకులు కోదండ రామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఈ చిత్రానికి పరుచూరి మురళి చక్కని కథను అందించారు. జూలైలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. చిరంతన్‌ భట్‌ సంగీతం, రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రామ్‌–లక్ష్మణ్‌ పోరాట సన్నివేశాలు సినిమాకి హైలైట్‌గా ఉంటాయి. చిన్నా ఆర్ట్‌ వర్క్‌ అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటుల వివరాలను తెలియజేస్తాం’’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: సి.వి.రావ్‌.

Advertisement
 
Advertisement
Advertisement