బాలయ్య కొత్త చిత్రం షూటింగ్‌ స్టార్ట్‌

Nandamuri Balakrishna And Boyapati Srinu New Film Shooting Starts - Sakshi

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా కొత్త సినిమా పట్టాలెక్కింది. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం ఆర్‌ఎఫ్‌సీలో ప్రారంభమైంది. ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌ కంపోజ్‌ చేసిన యాక్షన్‌ సన్నివేశాలతో సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. బాలకృష్ణ షూటింగ్‌లో పాల్గొంటున్న ఈ షెడ్యుల్‌ ఏకధాటిగా సాగనుంది. ఈ చిత్రం కోసం బాలకృష్ణ బరువు కూడా తగ్గారు.

ద్వారక క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సింహా, లెజెండ్స్‌ వంటి హిట్‌ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌ తెరకెక్కుతున్న మూడో చిత్రమిదే. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నటీనటులకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top