డిసెంబర్‌లో షురూ | nai next movie with siva nirvana | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో షురూ

Sep 14 2019 3:17 AM | Updated on Sep 14 2019 3:17 AM

nai next movie with siva nirvana - Sakshi

నాని

సినిమా తర్వాత సినిమా చేస్తూ స్పీడ్‌గా దూసుకెళ్లడం నాని స్టయిల్‌.  ఒక సినిమా విడుదల అవ్వడం.. మరో సినిమా పట్టాలెక్కడం జరుగుతూనే ఉంది. నాని నటించిన ‘గ్యాంగ్‌లీడర్‌’ చిత్రం ఈ శుక్రవారమే రిలీజ్‌ అయింది. ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని చేస్తున్న ‘వి’ సినిమా షూటింగ్‌ ఫుల్‌ స్పీడ్‌తో జరుగుతోంది. ఈ వారంలో థాయ్‌ల్యాండ్‌లో జరగనున్న షెడ్యూల్‌ కోసం ప్రయాణమయ్యారు నాని. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి నాని అంగీకరించారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్‌ డిసెంబర్‌లో షురూ కానుంది. షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై హరీష్‌ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తారు. ఇదిలా ఉంటే నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో ‘నిన్ను కోరి’ వంటి హిట్‌ సినిమా వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement