రిలీజ్కు రెడీ అవుతున్న సోగ్గాడు | Nagarjuna soggade chinni nayana Shooting complete | Sakshi
Sakshi News home page

రిలీజ్కు రెడీ అవుతున్న సోగ్గాడు

Oct 6 2015 9:07 AM | Updated on Jul 15 2019 9:21 PM

రిలీజ్కు రెడీ అవుతున్న సోగ్గాడు - Sakshi

రిలీజ్కు రెడీ అవుతున్న సోగ్గాడు

చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న కింగ్ నాగార్జున లేటెస్ట్ సినిమా 'సోగ్గాడు చిన్నినాయనా' ఫైనల్గా షూటింగ్ పూర్తి చేసుకుంది. కథా కథనాల్లో మార్పులతో రెండు మూడు సార్లు...

చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న కింగ్ నాగార్జున లేటెస్ట్ సినిమా 'సోగ్గాడు చిన్నినాయనా' ఫైనల్గా షూటింగ్ పూర్తి చేసుకుంది. కథా కథనాల్లో మార్పులతో రెండు మూడు సార్లు రీషూట్లకు వెళ్లిన ఈ సినిమా మైసూర్ జరిగిన భారీ షెడ్యూల్తో ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది.

ఈ సినిమాలో నాగ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.. పల్లెటూరి వాతావరణంలో సాగే ఈ కథలో సొగ్గాడిగా, అమాయకుడిగా రెండు వేరు వేరు పాత్రల్లో కనిపిస్తున్నాడు నాగ్. కామెడీ ప్రధానంగా సాగే ఈ కథలో తన కొడుకుకు మాత్రమే కనిపించే ఆత్మగా అలరించనున్నాడు. నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తుండగా, యాంకర్ అనసూయ, హంసానందినిలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ఉయ్యాల జంపాల ఫేం పి. రామ్మోహన్ కథ అందించగా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. త్వరలోనే సినిమా ఆడియో రిలీజ్ చేసి మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించడానికి చిత్రయూనిట్ రెడీ అవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement