సోగ్గాడి సీక్వెల్ బంగార్రాజు..? | nagarjuna soggade chinni nayana sequal bangarraju | Sakshi
Sakshi News home page

సోగ్గాడి సీక్వెల్ బంగార్రాజు..?

Jan 29 2016 3:29 PM | Updated on Jul 15 2019 9:21 PM

సోగ్గాడి సీక్వెల్ బంగార్రాజు..? - Sakshi

సోగ్గాడి సీక్వెల్ బంగార్రాజు..?

సంక్రాంతి బరిలో ఎలాంటి నెగెటివ్ టాక్ లేకుండా సక్సెస్ సాధించిన సినిమా కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా. నాగ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధం కానుంది.

సంక్రాంతి బరిలో ఎలాంటి నెగెటివ్ టాక్ లేకుండా సక్సెస్ సాధించిన సినిమా కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా. నాగ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా ఈ సినిమాలో సోగ్గాడిగా నాగ్ లుక్, పర్ఫార్మెన్స్కు మంచి మార్కులు పడ్డాయి. అదే జోష్లో సీక్వెల్తోనూ ఆకట్టుకోవాలని ఫ్లాన్ చేస్తున్నారు.

సీక్వెల్కు 'బంగార్రాజు' అనే టైటిల్ను పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. తొలి సినిమాకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణనే సీక్వెల్ను కూడా డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించారు. అన్నపూర్ణ బ్యానర్పై బంగార్రాజు సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్న నాగ్, 2017 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement