నమో వేంకటేశాయ...ఆ రోజు వస్తారయ! | Nagarjuna Om Namo Venkatesaya Movie Release on feb 10th | Sakshi
Sakshi News home page

నమో వేంకటేశాయ...ఆ రోజు వస్తారయ!

Dec 9 2016 1:00 AM | Updated on Jul 15 2019 9:21 PM

నమో వేంకటేశాయ...ఆ రోజు వస్తారయ! - Sakshi

నమో వేంకటేశాయ...ఆ రోజు వస్తారయ!

‘‘ఏమో గ్రాఫిక్స్‌కి చాలా టైమ్ పట్టేటట్లుంది. అంత టైమ్ తీసుకుంటేనే సినిమా క్వాలిటీగా ఉంటుంది.

‘‘ఏమో గ్రాఫిక్స్‌కి చాలా టైమ్ పట్టేటట్లుంది. అంత టైమ్ తీసుకుంటేనే సినిమా క్వాలిటీగా ఉంటుంది. అందుకని విడుదల తేదీ చెప్పడం కష్టం’’ అని ‘నమో వేంకటేశాయ’ గురించి నాగార్జున చెప్పి పది రోజులైంది. ఇప్పుడు గ్రాఫిక్స్‌కి ఎంత టైమ్ పడుతుందో చిత్ర దర్శక-నిర్మాతలు కె. రాఘవేంద్రరావు, ఎ. మహేశ్‌రెడ్డిలకు ఓ క్లారిటీ వచ్చేసినట్లుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడీ సాయి’ తర్వాత రాఘవేంద్రరావు -నాగార్జున కాంబినేషన్‌లో రూపొందుతోన్న భక్తిరసా త్మక చిత్రం ఇది.

హాథీ రామ్ బాబాగా నాగ్, వేంకటేశ్వర స్వామిగా సౌరభ్ జైన్, భక్తు రాలు కృష్ణమ్మగా అనుష్క నటిస్తున్న ఈ చిత్రంలో ఇంకా పలు వురు ప్రము ఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. వారిలో ‘కంచె’ చిత్ర ఫేవ్‌ు అయిన కథానాయిక ప్రజ్ఞా జైస్వాల్ కూడా ఉన్నారు. నాగ్-ప్రజ్ఞా జైస్వాల్‌ల మీద ఇటీవల ఓ పాట చిత్రీకరించారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభించింది. సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో ఈ చిత్ర బిజినెస్ కూడా బాగుంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పని జరుగుతోంది’’ అన్నారు.
 
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు జోడీ... ప్రజ్ఞా జైస్వాల్
భక్తిరస్మాతక చిత్రం ‘నమో వేంకటేశాయ’ చిత్రంలో నటించిన తర్వాత ప్రజ్ఞా జైస్వాల్ ఓ లవ్ కమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని అంగీకరించారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో ఒక కథానాయికగా రకుల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రజ్ఞా జైస్వాల్‌ని మరో నాయికగా తీసుకున్నామని గురువారం నిర్మాత తెలిపారు. కథానాయికలిద్దరికీ సమాన ప్రాధాన్యం ఉంటుందనీ, ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేశామనీ అన్నారు. బోయపాటి మార్క్ యాక్షన్‌తో సాగే చిత్రమని కూడా తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement