‘శైలజా రెడ్డి అల్లుడు’ కోసం ‘దేవదాస్‌’

Nagarjuna Nani Chief Guests For Shailaja Reddy Alludu Function - Sakshi

అక్కినేని యువ కథా నాయకుడు నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శైలజా రెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుండగా అను ఇమ్మాన్యూల్‌ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 31న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినా అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు.

రిలీజ్ డేట్‌ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ భారీ ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. సెప్టెంబర్‌9న నిర్వహించనున్న ఈ వేడుకకు దేవదాస్‌ చిత్ర కథానాయకులు నాగార్జున, నానిలు ముఖ్య అతిథిలుగా హాజరు కానున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్‌ సంగీతమందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top