మళ్లీ నిన్నే పెళ్లాడతా

Nagarjuna Launched Ninne Pelladatha title logo - Sakshi

నాగార్జున–కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’. ప్రస్తుతం ఈ టైటిల్‌తోనే ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ హీరోగా వైకుంఠ బోను దర్శకత్వం వహిస్తున్నారు. బొల్లినేని రాజశేఖర్‌ చౌదరి, వెలుగోడు శ్రీధర్‌బాబు నిర్మాతలు. ఈ చిత్రం టైటిల్‌ లోగోను నాగార్జున రిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు వైకుంఠ బోను మాట్లాడుతూ – ‘‘లోగో రిలీజ్‌ చేసిన నాగార్జునగారికి కృతజ్ఞతలు. మంచి కథాంశంతో ఈ చిత్రం చేస్తున్నాం. ఇప్పటికి 50 శాతం షూటింగ్‌ పూర్తయింది. ఆగస్ట్‌లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. అక్టోబర్‌లో రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వైజాగ్, కులుమనాలిలో ఓ షెడ్యూల్‌ చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: ఈదర ప్రసాద్, సంగీతం: నవనీత.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top