జోరు చూపిస్తున్న సోగ్గాడు | Nagarjuna enters into 40 crore club with soggade chinni nayana | Sakshi
Sakshi News home page

జోరు చూపిస్తున్న సోగ్గాడు

Jan 29 2016 8:44 AM | Updated on Jul 15 2019 9:21 PM

జోరు చూపిస్తున్న సోగ్గాడు - Sakshi

జోరు చూపిస్తున్న సోగ్గాడు

సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో ఎలాంటి నెగెటివ్ టాక్ లేకుండా ఆకట్టుకున్న సినిమా సోగ్గాడే చిన్నినాయనా. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బాలయ్య డిక్టేటర్ లాంటి సినిమాలు పోటి ఉన్నా, సోగ్గాడిగా...

సంక్రాంతి పండుగకు విడుదలైన నాలుగు సినిమాల్లో ఎలాంటి నెగిటివ్ టాక్ లేకుండా ఆకట్టుకున్న సినిమా సోగ్గాడే చిన్నినాయనా. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బాలయ్య డిక్టేటర్ లాంటి సినిమాలు పోటి ఉన్నా, సోగ్గాడిగా వచ్చిన నాగ్ సత్తా చాటాడు. ముఖ్యంగా ఎ, బి సెంటర్స్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథా కథనాలు కావటం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. సోగ్గాడే చిన్ని నాయనా రిలీజై ఇప్పటికే రెండు వారాలు దాటిన కలెక్షన్ల జోరు మాత్రం తగ్గటంలేదు. రివ్యూలతో పాటు, మౌత్ టాక్ కూడా బాగా వస్తుండటంతో నాగ్ కెరీర్లోనే హయ్యస్ట్ వసూళ్లతో దూసుకుపోతోంది ఈ సినిమా.

లిమిటెడ్ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇంక చాలా చోట్ల హౌస్ఫుల్ అవుతుండటంతో పాటు శాటిలైట్ రైట్స్ లాంటి వాటితో 50 కోట్ల మార్క్ను ఈజీగా రీచ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. థియేటర్లలో మరికొద్ది రోజుల పాటు సోగ్గాడి సందడి ఉంటుందంటున్నారు అక్కినేని అభిమానులు. నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అనూప్ అందించిన సంగీతం సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement