రాజుగారూ... మీరు మామూలోరు కాదు! | Nagarjuna as mentalist in 'Raju Gari Gadhi 2' | Sakshi
Sakshi News home page

రాజుగారూ... మీరు మామూలోరు కాదు!

Feb 15 2017 11:11 PM | Updated on Jul 15 2019 9:21 PM

రాజుగారూ... మీరు మామూలోరు కాదు! - Sakshi

రాజుగారూ... మీరు మామూలోరు కాదు!

ఈ రాజుగారి దగ్గరకు వెళుతున్నారా? అయితే.. తనువూ మనసూ రెండూ జాగ్రత్త సుమా! ఎందుకంటే... మీ మనసులో ఆలోచనలను చదివేస్తారు.

ఈ రాజుగారి దగ్గరకు వెళుతున్నారా? అయితే.. తనువూ మనసూ రెండూ జాగ్రత్త సుమా! ఎందుకంటే... మీ మనసులో ఆలోచనలను చదివేస్తారు. అంతేనా.. రాజుగారి దగ్గర అసాధారణ శక్తులున్నాయి. మీపై ఆ శక్తులను ప్రయోగించినా ఆశ్చర్యపోవడానికి లేదు. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే... ఈయన  ‘మెంటలిస్ట్‌’ అన్నమాట. నాగార్జున హీరోగా ఓంకార్‌ దర్శకత్వంలో పీవీపీ సినిమాస్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్న హారర్‌ థ్రిల్లర్‌ ‘రాజుగారి గది–2’.

ఇందులో నాగార్జున ‘మెంటలిస్ట్‌’ పాత్రలో నటిస్తున్నారట! ‘రాజుగారి గది’లో ఇలాంటి పాత్ర లేదు. సీక్వెల్‌లో కొత్తగా సృష్టించారు. అది కూడా నాగార్జున ఇమేజ్‌కి తగ్గట్టు సై్టలిష్‌గా డిజైన్‌ చేశారట! ‘‘సినిమాలో నాగార్జున ఓ ఫ్యాన్సీ బైక్‌ రైడ్‌ చేస్తూ కనిపిస్తారు. ఇందులో సమంత కీలక పాత్ర చేస్తున్నారు. ప్రచారంలో ఉన్నట్టు ఆమె నాగార్జునకు జోడీగా నటించడం లేదు.

 సమంత నటన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది’’ అని చిత్రబృందం సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మరి, సమంత దెయ్యంగా నటిస్తున్నారా? అనడిగితే.. ‘‘ఇప్పుడే అవన్నీ చెప్పడం కష్టం. ఇప్పటివరకూ చేయనటువంటి పాత్ర చేస్తున్నారామె’’ అన్నారు. సీరత్‌ కపూర్, అశ్విన్‌బాబు, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీత దర్శకుడు.
 

Advertisement
 
Advertisement
Advertisement