ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌: వాహ్‌.. నాగ్‌

Nagarjuna Accept Fitness Challenge Posted Video - Sakshi

ప్రస్తుతం దేశం మొత్తం ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ ఫీవర్‌తో ఊగిపోతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు... అంతా ఒకరికొకరు సవాళ్లు విసిరుకుంటూ వీడియోలతో హల్‌ చల్‌ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌లోని ప్రముఖులు కూడా క్యూ కట్టేశారు. స్టార్‌ హీరో ఎన్టీఆర్‌.. చెర్రీ, మహేష్‌, కొరటాల శివ, రాజమౌళి, కళ్యాణ్‌ రామ్‌ తదితరులకు ఛాలెంజ్‌ విసరటం చూశాం. ఇప్పుడు సీనియర్‌ హీరో నాగ్‌ వంతు వచ్చింది. 

తనయుడు అఖిల్‌ విసిరిన ఛాలెంజ్‌కు నాగార్జున అక్కినేని స్పందించారు. ఈ ఉదయం జిమ్‌లో చేసిన ఎక్సర్‌సైజ్‌లకు వీడియో ఒకదానిని పోస్ట్‌ చేశాడు. వెయిట్‌ లిఫ్టింగ్‌కు సంబంధించిన వర్కవుట్ల కోసం బాగానే కష్టపడ్డాడు. ఇవన్నీ చూస్తుంటే 58 ఏళ్ల వయసులోనూ నాగ్‌ ఫిట్‌గా ఉండటంలో ఆశ్చర్యం లేదనిపిస్తోంది. అన్నట్లు ఇంతకీ నాగ్‌ ఎవరికి ఛాలెంజ్‌ విసిరాడో తెలుసా? నేచురల్‌ స్టార్‌ నాని, హీరో కార్తీ, శిల్పారెడ్డిలకు. ఆ వీడియో చూసిన అభిమానులంతా ‘వాహ్‌ నాగ్‌’ అంటున్నారు.

మరోవైపు వర్మ దర్శకత్వంలో  నాగ్‌ నటించిన నటించిన ఆఫీసర్‌ చిత్రం నేడు విడుదల కాగా, నానితో చేస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది.  ఇవికాకుండా కోలీవుడ్‌ హీరో ధనుష్‌ డైరెక్షన్‌లో ఓ చిత్రం ఉండబోతున్నట్లు నాగ్‌ ప్రకటించాడు కూడా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top