లొల్ల లాకుల వద్ద ‘వెంకీ మామ’ | Naga Chaitanya Venky Mama Shooting in East Godavari | Sakshi
Sakshi News home page

లొల్ల లాకుల వద్ద ‘వెంకీ మామ’

Feb 26 2019 9:31 AM | Updated on Feb 26 2019 9:31 AM

Naga Chaitanya Venky Mama Shooting in East Godavari - Sakshi

అభిమానులకు అభివాదం చేస్తున్న హీరో నాగచైతన్య

తూర్పుగోదావరి, ఆత్రేయపురం (కొత్తపేట): సురేష్‌ ప్రొడక్షన్స్, పీపుల్స్‌ మీడియా, కోన ఫిలిం కార్పొరేషన్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘వెంకీ మామ’ సినిమా షూటింగ్‌ లొల్ల లాకుల పరిసరాల్లో శరవేగంగా సాగుతోంది. హీరోలు వెంకటేష్, నాగచైతన్య హీరోయిన్లు రాశి ఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌లపై సోమవారం వివిధ సన్నివేశాలు చిత్రీకరించారు. సురేష్‌బాబు, విశ్వప్రసాద్, కోన వెంకట్‌ నిర్మాతలు కాగా బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో, హీరోయిన్లను చూసేందుకు అభిమానులు ఎగబడడంతో ఈ ప్రాంతంలో కోలాహలం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement