ఒకే ఒక్క గెలుపుతో సరిపెట్టుకున్న దసరా | Naga Chaitanya starrer Premam to hit screens in Dussehra | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్క గెలుపుతో సరిపెట్టుకున్న దసరా

Oct 23 2016 12:51 AM | Updated on Sep 29 2018 5:52 PM

ఒకే ఒక్క గెలుపుతో సరిపెట్టుకున్న దసరా - Sakshi

ఒకే ఒక్క గెలుపుతో సరిపెట్టుకున్న దసరా

సినిమా వసూళ్లు రాబట్టుకోవడానికి దసరా మంచి సీజన్. స్కూల్ హాలిడేస్‌ని క్యాష్ చేసుకోవచ్చు.

 సినిమా వసూళ్లు రాబట్టుకోవడానికి దసరా మంచి సీజన్. స్కూల్ హాలిడేస్‌ని క్యాష్ చేసుకోవచ్చు. మొత్తం మీద అందరిలోనూ హాలిడే మూడ్ ఉంటుంది. ఎన్ని సినిమాలు రిలీజైనా చూసేంత టైమ్ ఉంటుంది. ఈ దసరాకి హైపర్, మన ఊరి రామాయణం, అభినేత్రి, జాగ్వర్, ప్రేమమ్, ఈడు గోల్డెహె వచ్చాయి. వీటిలో ‘హైపర్’ సేఫ్ అనిపించుకుంది. మిగతా ఐదు సినిమాల్లో ‘ప్రేమమ్’ ముందు వరుసలో నిలిచింది.
 
  పెట్టిన పెట్టుబడికి రెండింతలు ఆదాయాన్ని తెచ్చే సినిమా అనిపించుకుంది. కొనుక్కున్న బయ్యర్లకు దసరా ఆనందాన్ని చూపించింది. మిగతా చిత్రాల్లో ‘అభినేత్రి’, ‘జాగ్వర్’, ‘ఈడు గోల్డ్ ఎహె’, ‘మన ఊరి రామామయణం’ పెట్టిన పెట్టుబడిని కూడా దక్కించుకోలేకపోవడం నిర్మాతలకు బాధాకరం. హాలిడేస్ కావడం వల్లే నామమాత్రం వసూళ్లయినా రాబట్టుకోగలిగాయి. ఆరు సినిమాలూ ఒకేసారి విడుదల కావడం ఒక మైనస్ పాయింట్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement