హాలిడే హంగామా | Naga Chaitanya Samantha Summer Trip enjoyed | Sakshi
Sakshi News home page

హాలిడే హంగామా

Jun 3 2017 11:40 PM | Updated on Aug 29 2018 5:43 PM

హాలిడే హంగామా - Sakshi

హాలిడే హంగామా

ముందు సముద్రం... చుట్టూ పచ్చదనం... తోడుగా చైతన్యం... ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు సమంత.

ముందు సముద్రం... చుట్టూ పచ్చదనం... తోడుగా చైతన్యం... ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు సమంత. కాబోయే శ్రీవారు నాగచైతన్యతో కలసి సమంత సమ్మర్‌ ట్రిప్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. వీళ్లిప్పుడు థాయ్‌ల్యాండ్‌లోని కోహ్‌ సముయ్‌లో ఉన్నారు. నార్మల్‌గా షూటింగులు, స్టోరీ సిట్టింగుల కోసమని హైదరాబాద్‌ సిటీలోనో, మరెక్కడో ఉంటే... డైటింగ్, జిమ్‌లో వర్కౌట్స్‌ ట్రైనింగ్‌ అంటూ ఏవేవో ఫాలో అవుతుంటారు.

అంత దూరం వెళ్లి, అక్కడ కూడా వర్కౌట్స్‌ చేయడం, డైట్‌ ఫాలో కావడం ఎందుకని అనుకున్నట్టున్నారు. ఈ సమ్మర్‌ హాలిడేలో వాటన్నిటికీ ఫుల్‌ స్టాప్‌ పెట్టేశారట. నో డైట్‌... నో వర్కౌట్స్‌... శుభ్రంగా మనసుకు నచ్చిన ఫుడ్‌ తింటూ తిరిగేస్తున్నారట! ‘హాలిడేస్‌లో నేను ఇలాగే వర్కౌట్‌ చేస్తా’ అని బాక్సింగ్‌ కోర్టులో నిద్రపోతున్న ఫొటోను, మరికొన్ని హాలిడే ఫొటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement