వేడుకకు ఆహ్వానిస్తున్న నాగచైతన్య..? | Naga Chaitanya Next Movie title Raarandoi Veduka Choodam | Sakshi
Sakshi News home page

వేడుకకు ఆహ్వానిస్తున్న నాగచైతన్య..?

Mar 21 2017 10:22 AM | Updated on Sep 5 2017 6:42 AM

వేడుకకు ఆహ్వానిస్తున్న నాగచైతన్య..?

వేడుకకు ఆహ్వానిస్తున్న నాగచైతన్య..?

ప్రేమమ్ సినిమా సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న నాగచైతన్య అదే జోరులో సినిమాలు పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం సోగ్గాడే

ప్రేమమ్ సినిమా సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న నాగచైతన్య అదే జోరులో సినిమాలు పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు కృష్ణమరియముత్తు దర్శకత్వంలో మరో సినిమాను సైలెంట్గా పూర్తి చేస్తున్నాడు. వీటిలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ 'రారాండోయ్ వేడుక చూద్దాం' అనే టైటిల్ను రిజిస్టర్ చేయించింది. ముందుగా ఈ టైటిల్ అఖిల్ సినిమా కోసం అని భావించినా.. ఇది నాగచైతన్య లేటెస్ట్ సినిమా కోసం రిజిస్టర్ చేయించారన్న టాక్ వినిపిస్తోంది.

కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న సినిమా నిన్నేపెళ్లాడతా తరహా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని ముందుకు నుంచే చెపుతున్నారు చిత్రాయూనిట్. అలాంటి కథకు ఇది పర్ఫెక్ట్ టైటిల్ అని.. ఈ సినిమాతో చైతన్యకు మరో బ్లాక్ బస్టర్ కన్ఫామ్ అంటున్నారు అక్కినేని అభిమానులు. నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్పై తెరకెక్కుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement