సెలబ్రేషన్@గోవా | naga chaitanya birthday celebrations in goa | Sakshi
Sakshi News home page

సెలబ్రేషన్@గోవా

Nov 24 2018 5:10 AM | Updated on Nov 24 2018 5:21 AM

naga chaitanya birthday celebrations in goa - Sakshi

సమంత, నాగచైతన్య

నాగచైతన్య, సమంతల పెళ్లి గతేడాది గోవాలో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. మళ్లీ చైతన్య, సమంత గోవా వెళ్లారు. గురువారం నాగచైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా గోవా వెళ్లారు చై, సామ్‌. బర్త్‌డే వేడుకలను గోవాలో సెలబ్రేట్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘హోమ్‌ స్వీట్‌ హోమ్‌ గోవా’ అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టేటస్‌లో పేర్కొన్నారు సమంత. ఇక సినిమాల విషయానికి వస్తే... ‘మజిలీ’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలో నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్, నాగచైతన్యల ‘వెంకీమామ’ సినిమా డిసెంబర్‌లో స్టార్ట్‌ కానుంది. అలాగే సమంత నటించనున్న లేడీ ఒరియంటెడ్‌ మూవీ ‘మిస్‌. గ్రానీ’కి సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement