కలహాల కాపురం

Naga Chaitanya and Samantha turn into a troubled couple for Majili - Sakshi

గొడవపడందే రోజు గడవడం లేదంట నాగచైతన్య, సమంత దంపతులకు. అసలు వీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు? వీరి కలహాల కాపురానికి కారణాలు ఏంటి? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్‌. ‘నిన్నుకోరి’ ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా ‘మజిలీ’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజ జీవితంలో దంపతులైన నాగచైతన్య, సమంతలు ఈ చిత్రంలోనూ దంపతులుగానే కనిపించనున్నారు.

వివాహం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రమిదే కావడం విశేషం. స్క్రిప్ట్‌ పరంగా ‘మజలీ’ సినిమాలో చైతూకు, సమంతకు గొడవలు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోన్న షూటింగ్‌లో ఈ సన్నివేశాలనే చిత్రీకరిస్తున్నారట. వీరి గొడవలు రీల్‌ లైఫ్‌లోనే కానీ రియల్‌ లైఫ్‌లో కాదని ఇప్పటికైనా అర్థమైందా?. డిసెంబర్‌ తొలి వారానికి ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 50 శాతం పూర్తవుతుందని వినికిడి. నటుడు సుబ్బరాజు ఓ కీలకపాత్ర చేస్తున్న ఈ సినిమాకు సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మాతలు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top