నాగ్, కార్తీల 'ఊపిరి' మోషన్ పోస్టర్ | Nag, Karthi new movie Oopiri motion poster | Sakshi
Sakshi News home page

నాగ్, కార్తీల 'ఊపిరి' మోషన్ పోస్టర్

Sep 18 2015 1:39 PM | Updated on Jul 15 2019 9:21 PM

నాగ్, కార్తీల 'ఊపిరి' మోషన్ పోస్టర్ - Sakshi

నాగ్, కార్తీల 'ఊపిరి' మోషన్ పోస్టర్

మన్మథుడు నాగార్జున, తమిళ స్టార్ కార్తీల కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.

మన్మథుడు నాగార్జున, తమిళ స్టార్ కార్తీల కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో రూపొందించిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పివిపి సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఫ్రెంచ్ మూవీ ఇన్టచబుల్ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చాలా భాగం నాగ్ వీల్ చైర్ లోనే కనిపించనున్నాడు. తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా అనుష్క గెస్ట్ రోల్ లో అలరించనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement