మనసులను చదివే మన్మథుడు! | Nag back to his Stylish Look in raju gari gadhi -2 | Sakshi
Sakshi News home page

మనసులను చదివే మన్మథుడు!

Mar 21 2017 10:38 PM | Updated on Jul 15 2019 9:21 PM

మనసులను చదివే మన్మథుడు! - Sakshi

మనసులను చదివే మన్మథుడు!

బాబు... ఓ లుక్కేయండి ఇటు. ‘రాజుగారి గది–2’లో నాగార్జున లుక్‌ బయటకు వచ్చేసింది. లేదు

బాబు... ఓ లుక్కేయండి ఇటు. ‘రాజుగారి గది–2’లో నాగార్జున లుక్‌ బయటకు వచ్చేసింది. లేదు... లేదు... ఆయనే బయట పెట్టేశారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... ఈ లుక్‌లో మన్మథుడు మాంచి స్టైలిష్‌గా ఉన్నారు కదూ! ఇంకోసారి ఒళ్లంతా కళ్లు చేసుకుని లుక్కేయండి. స్టైల్‌తో పాటు భక్తి కూడా కనిపిస్తుంది. మెడలో త్రిశూలం... చేతికి ఓంకారం తాయత్తులు... వేలికి ఉంగరాలు ధరించారు. ఇవన్నీ ఎందుకనే డౌట్‌ వచ్చిందా? మరి, ఆయన చేస్తున్నది మామూలు పాత్ర కాదు... ఈ హారర్‌ థ్రిల్లర్‌లో నాగ్‌ది మెంటలిస్ట్‌ క్యారెక్టర్‌. దెయ్యాలతో పాటు మనుషుల మనసులను చదవాలంటే ఈ మాత్రం ఉండాలి కదా!

ఓంకార్‌ దర్శకత్వంలో పీవీపీ సినిమాస్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుగుతోంది. నాగార్జున, సీనియర్‌ నరేశ్‌లపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. పాండిచ్చేరిలో 20 రోజులు జరగనున్న ఈ మూడో షెడ్యూల్‌తో 70 శాతం టాకీ పార్ట్‌ పూర్తవుతుందని దర్శకుడు తెలిపారు. సమంత, సీరత్‌ కపూర్‌ కథానాయికలుగా, అశ్విన్‌బాబు, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏఎస్‌ ప్రకాశ్, కెమేరా: దివాకరన్, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌.

Advertisement
 
Advertisement
Advertisement