నఫీసా అలీ భావోద్వేగం

Nafisa Ali Emotional Post After Chemotherapy - Sakshi

‘మూడో కీమోథెరపీ పూర్తయింది. ఇప్పుడే అసలైన యుద్ధం మొదలైంది. తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను త్వరగా కోలుకోవాలంటూ ఇంతమంది కోరుకోవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీ మాటలే నాకు ధైర్యాన్ని, బతుకతాననే ఆశను బలంగా రేకెత్తిస్తాయి’ అంటూ బెంగాల్‌ నటి, కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు నఫీసా అలీ(61) ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు ఆమె అభిమానులను ఉద్వేగానికి గురిచేస్తోంది.

తాను ఒవేరియన్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్నానే విషయాన్ని నఫీసా అలీ గతేడాది నవంబరులో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఆమె... ‘ నా విలువైన స్నేహితురాలిని కలుసుకున్నాను. స్టేజ్‌ 3 క్యాన్సర్‌తో బాధపడుతున్న నేను త్వరగా కోలుకోవాలని ఆమె ఆశించారు’ అంటూ క్యాప్షన్‌ జతచేశారు. కాగా బెంగాల్‌లో జన్మించిన నఫీసా ‍ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. ఆమె తాతయ్య వాజిద్‌ అలీ ప్రముఖ రచయిత. ఇక ఆమె మేనత్త జైబ్‌-ఉన్నీసా- హమీదుల్లా స్త్రీవాదిగా గుర్తింపు పొందారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top