యూనివర్సల్‌ లవ్‌స్టోరీ | Na Love Story Movie Press Meet | Sakshi
Sakshi News home page

యూనివర్సల్‌ లవ్‌స్టోరీ

Jun 29 2018 12:14 AM | Updated on Aug 28 2018 4:32 PM

Na Love Story Movie Press Meet - Sakshi

దర్శకుడు శివ గంగాధర్‌

‘‘యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటరై్టనర్స్‌కు ఆడియన్స్‌లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ప్రేక్షకులను అలరించే అంశాలు, కాస్త ఎమోషన్, మరికాస్త సెంటిమెంట్‌ కలపి దాన్ని  ప్రేమకథకు ముడేస్తే హిట్‌ మెటీరియల్‌. అలాంటి అంశాలతో వస్తోన్న సినిమానే ‘నా లవ్‌ స్టోరీ’ అని దర్శకుడు శివ గంగాధర్‌ అన్నారు. మహిధర్, సోనాక్షి సింగ్‌ జంటగా జి.లక్ష్మి నిర్మించిన ‘నా లవ్‌ స్టోరీ’ ఈరోజు రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గంగాధర్‌ మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా. కథే హీరో. యూత్‌కి కనెక్ట్‌ అయ్యే యూనివర్సల్‌ లవ్‌స్టోరీ ఇది. మంచి స్క్రీన్‌ ప్లే ఉంటుంది. హీరోతో మొదలయ్యే లవ్‌ స్టోరీ హీరోయిన్‌తో ఎండ్‌ అవుతుంది. ఇది ఇప్పటి వరకూ రాని పాయింట్‌. మా సినిమా చూస్తే  పేరెంట్స్‌ మారతారనే నమ్మకం ఉంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement