'సిక్స్ ప్యాక్ నా పిల్లల్ని ఆకట్టుకోలేదు' | My daughters weren't impressed by my six-pack abs: Farhan Akhtar | Sakshi
Sakshi News home page

'సిక్స్ ప్యాక్ నా పిల్లల్ని ఆకట్టుకోలేదు'

Feb 25 2014 1:04 PM | Updated on Nov 6 2018 4:57 PM

'సిక్స్ ప్యాక్ నా పిల్లల్ని ఆకట్టుకోలేదు' - Sakshi

'సిక్స్ ప్యాక్ నా పిల్లల్ని ఆకట్టుకోలేదు'

మిల్కా సింగ్ జీవిత కథ నేపథ్యంగా తెరకెక్కిన 'భాగ్ మిల్కా భాగ్' చిత్రం కోసం బాలీవుడ్ నటుడు,దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కఠోరంగా శ్రమించిన సంగతి తెలిసిందే.

మిల్కా సింగ్ జీవిత కథ నేపథ్యంగా తెరకెక్కిన 'భాగ్ మిల్కా భాగ్' చిత్రం కోసం బాలీవుడ్ నటుడు,దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కఠోరంగా శ్రమించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీతో అభిమానులను, ప్రేక్షకులను ఫర్హాన్ ఆకట్టుకున్నారు. అయితే తన పిల్లలను తన సిక్స్ ప్యాక్ బాడీ ఆకట్టుకోలేదని ఆయన తెలిపారు. ఆ చిత్రంలో తాను పెరిగెత్తడమే వాళ్లను ఆనందానికి గురి చేసిందన్నారు. 
 
ఇటీవల తన కూతురి స్కూల్ లో జరిగిన రేసింగ్ ఈవెంట్ లో ఫర్హాన్ పాల్గొన్నారు.  స్కూల్ రేసింగ్ కార్యక్రమంలో తాను ముందుండి పరిగెత్తడం తన కూతుళ్లు షక్యా, అకిరాలకు చెప్పలేనంత ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా చాలా గర్వంగా ఫీల్ అయ్యారని ఫర్హాన్ తెలిపారు. 
 
దర్శకుడు సాకెత్ చౌదరీ రూపొందించిన 'షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్' చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో ప్రస్తుతం ఫరాన్ అక్తర్  బిజీగా ఉన్నారు. వైవాహిక బంధాలు, సంబంధాలు నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రం అందర్ని ఆకట్టుకుంటుందనే అభిప్రాయాన్ని ఫర్హాన్ వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ సరసన విద్యా బాలన్ నటించింది. 

Advertisement
 
Advertisement
Advertisement