breaking news
Bhaag Milkha Bhaag
-
జాతీయ ఉత్తమ చిత్రం ‘షిప్ ఆఫ్ థీసీయస్’
* జాతీయ అవార్డుల ప్రకటన *షాహిద్ చిత్ర దర్శకుడు మెహతాకు ఉత్తమ దర్శకుడి పురస్కారం * ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా భాగ్ మిల్కా భాగ్ తెలుగు చిత్రానికి మూడు అవార్డులు న్యూఢిల్లీ: 61వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 2013 సంవత్సరానికిగానూ ప్రకటించిన జాతీయ అవార్డుల్లో హిందీ సినిమాల హవా నడిచింది. ప్రధాన విభాగాలన్నిటిలోనూ బాలీవుడ్ చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. జాతీయ ఉత్తమ చిత్రంగా ఆనంద్ గాంధీ దర్శకత్వం వహించిన ‘షిప్ ఆఫ్ థీసీయస్’ (హిందీ-ఇంగ్లిష్) ఎంపికైంది. ఆనంద్ గాంధీకి ఇదే తొలిచిత్రం కావడం విశేషం. గుర్తింపు, నమ్మకం, మరణం వంటి సంక్లిష్టమైన అంశాలను ‘షిప్ ఆఫ్ థీసీయస్’లో సమర్థవంతంగా తెరకెక్కించడంతో ఆనంద్ గాంధీ విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త షాహిద్ అజ్మీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన హిందీ చిత్రం ‘షాహిద్’ డెరైక్టర్ హన్సల్ మెహతాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు దక్కింది. షాహిద్ చిత్రంలోనే నటించిన రాజ్‌కుమార్ రావ్, మలయాళ చిత్రం పెరారియావతర్లో నటించిన సూరజ్ వెంజారమూడు సంయుక్తంగా ఉత్తమ నటులుగా పురస్కారం దక్కించుకున్నారు. హిందీ చిత్రం ‘లయర్స్ డైస్’లో నటించిన గీతాంజలి థాపా ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత చరిత్ర ఆధారంగా రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా తెరకెక్కిన ‘భాగ్ మిల్కా భాగ్’ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది. ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సయీద్ అక్తర్ మీర్జా నేతృత్వంలోని 11 మంది సభ్యుల జ్యూరీ 310 చిత్రాలను వడపోసి జాతీయ అవార్డులను ఎంపిక చేసింది. మే 3వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరిగే అవకాశం ఉంది. దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన ప్రముఖ కవి, సినీ గీత రచయిత, దర్శకుడు గుల్జార్‌కు అదే రోజు అవార్డు అందించనున్నారు. జాతీయ అవార్డు రావడంతో చాలా ఉద్వేగానికి గురయ్యా అని షిప్ ఆఫ్ థీసీయస్ దర్శకుడు ఆనంద్ గాంధీ చెప్పారు. ఈ అవార్డును షాహిద్ అజ్మీకి అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. అవార్డులు ఎవరికి? ఉత్తమ చిత్రం: షిప్ ఆఫ్ థీసీయస్ (హిందీ-ఇంగ్లిష్) ఉత్తమ దర్శకుడు: హన్సల్ మెహతా (షాహిద్-హిందీ) ఉత్తమ నటుడు: రాజ్‌కుమార్ రావ్ (షాహిద్-హిందీ), సూరజ్ వెంజారమూడు(పెరారియావతర్-మలయాళం) ఇద్దరికి సంయుక్తంగా ఉత్తమ నటి: గీతాంజలి థాపా (లయర్స్ డైస్-హిందీ) ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: భాగ్ మిల్కా భాగ్ (హిందీ) ఉత్తమ హిందీ చిత్రం: జాలీ ఎల్ఎల్బీ ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం(నర్గీస్ దత్ అవార్డు): బాలు మహేంద్ర (తలైమురైగల్-తమిళం) ఉత్తమ బాలల చిత్రం: కపాల్ (హిందీ) ఉత్తమ నేపథ్య గాయకుడు: రూపాంకర్ (జాతీశ్వర్-బెంగాలీ) ఉత్తమ నేపథ్య గాయని: బెలా షిండే (తుహ్యా ధర్మ కొంచా-మరాఠీ) ఉత్తమ మాటల రచయిత: సుమిత్రా భావే(అస్తు-మరాఠీ) ఉత్తమ పాటల రచయిత: ఎన్ఏ ముత్తుకుమార్ (తంగా మింకాల్-తమిళం) ఉత్తమ నృత్య దర్శకత్వం: గణేశ్ ఆచార్య(భాగ్ మిల్కా భాగ్-హిందీ) ఉత్తమ సంగీత దర్శకత్వం: కబీర్ సుమన్ (జాతీశ్వర్-బెంగాలీ) ఉత్తమ సామాజికాంశ చిత్రం: గులాబ్ గ్యాంగ్(హిందీ) తెలుగు వెలుగులు... ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం: నా బంగారు తల్లి ఉత్తమ నేపథ్య సంగీతం: శంతనూ మొయిత్రా(నా బంగారు తల్లి) స్పెషల్ జ్యూరీ పురస్కారం: అంజలీ పాటిల్ (నా బంగారు తల్లి) ఉత్తమ సినిమా పుస్తకం: సినిమాగా సినిమా (నందగోపాల్-తెలుగు) -
'సిక్స్ ప్యాక్ నా పిల్లల్ని ఆకట్టుకోలేదు'
మిల్కా సింగ్ జీవిత కథ నేపథ్యంగా తెరకెక్కిన 'భాగ్ మిల్కా భాగ్' చిత్రం కోసం బాలీవుడ్ నటుడు,దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కఠోరంగా శ్రమించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీతో అభిమానులను, ప్రేక్షకులను ఫర్హాన్ ఆకట్టుకున్నారు. అయితే తన పిల్లలను తన సిక్స్ ప్యాక్ బాడీ ఆకట్టుకోలేదని ఆయన తెలిపారు. ఆ చిత్రంలో తాను పెరిగెత్తడమే వాళ్లను ఆనందానికి గురి చేసిందన్నారు. ఇటీవల తన కూతురి స్కూల్ లో జరిగిన రేసింగ్ ఈవెంట్ లో ఫర్హాన్ పాల్గొన్నారు. స్కూల్ రేసింగ్ కార్యక్రమంలో తాను ముందుండి పరిగెత్తడం తన కూతుళ్లు షక్యా, అకిరాలకు చెప్పలేనంత ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా చాలా గర్వంగా ఫీల్ అయ్యారని ఫర్హాన్ తెలిపారు. దర్శకుడు సాకెత్ చౌదరీ రూపొందించిన 'షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్' చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో ప్రస్తుతం ఫరాన్ అక్తర్ బిజీగా ఉన్నారు. వైవాహిక బంధాలు, సంబంధాలు నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రం అందర్ని ఆకట్టుకుంటుందనే అభిప్రాయాన్ని ఫర్హాన్ వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ సరసన విద్యా బాలన్ నటించింది. -
ఫిల్మ్ ఫేర్ అవార్డులను క్లిన్ స్వీప్ చేసిన ’భాగ్ మిల్కా భాగ్’
-
'భాగ్ మిల్కా భాగ్'కు అవార్డుల పంట
ముంబై: భారత అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన హిందీ చిత్రం భాగ్ మిల్కా భాగ్ అవార్డుల పంట పండించింది. ఏకంగా ఆరు ఫిలింఫేర్ అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు కేటగిరీల్లో ఈ సినిమా అవార్డులను దక్కించుకుంది. ఫర్హాన్ అక్తర్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది. మిల్కా సింగ్ పాత్రను ఫర్హాన్ పోషించారు. ఉత్తమ గీత రచయితగా ప్రసూన్ జోషి, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా డోలీ అహ్లువాలియా ఎంపికయ్యారు. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీలో భాగ్ మిల్కా భాగ్ చిత్రం అవార్డు సొంతం చేసుకుంది. -
ఆస్కార్‌కి ది గుడ్ రోడ్
‘ది లంచ్ బాక్స్, భాగ్ మిల్కా భాగ్, ఇంగ్లిష్ వింగ్లిష్లాంటి హిందీ చిత్రాలతో పాటు ఉత్తరాదిన పలు చిత్రాలు, కమల్‌హాసన్ ‘విశ్వరూపం’తో కలిపి దక్షిణాదిన పలు చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్ విభాగంలో నామినేషన్ ఎంట్రీకి పోటీపడ్డాయి. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఈ అరుదైన అవకాశం ఏ చిత్రానికి దక్కుతుందా? అనే చర్చకు తెరపడింది. పోటీలో మొత్తం 22 చిత్రాలు నిలవగా, అన్నిటికన్నా ది బెస్ట్ ‘ది గుడ్ రోడ్’ అని కమిటీ నిర్ణయించింది. మన భారతదేశం తరఫున ఈ గుజరాతీ చిత్రాన్ని నామినేషన్ ఎంట్రీకి పంపించడానికి ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ అధ్యక్షుడు గౌతమ్ ఘోష్, ఇతర జ్యూరీ సభ్యులు నిర్ణయించారు. ఐదు గంటలు సుదీర్ఘ చర్చ జరిపిన తర్వాత ఏకగ్రీవంగా జ్యూరీ మొత్తం ‘ది గుడ్ రోడ్’కే ఓటేశారు. ఆల్రెడీ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు దక్కించుకుంది ఈ చిత్రం. కేవల్ కట్రోడియా, సొనాలీ కులకర్ణి, అజయ్ గేహి ముఖ్య పాత్రలు చేసిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు గ్యాన్ కొరియా దర్శకత్వం వహించారు. -
భాగ్ బస్టర్