'భాగ్ మిల్కా భాగ్'కు అవార్డుల పంట | Bhaag Milkha Bhaag' sweeps Filmfare Awards | Sakshi
Sakshi News home page

'భాగ్ మిల్కా భాగ్'కు అవార్డుల పంట

Jan 25 2014 2:45 PM | Updated on Apr 3 2019 6:23 PM

'భాగ్ మిల్కా భాగ్'కు అవార్డుల పంట - Sakshi

'భాగ్ మిల్కా భాగ్'కు అవార్డుల పంట

భారత అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన హిందీ చిత్రం భాగ్ మిల్కా భాగ్ అవార్డుల పంట పండించింది.

ముంబై: భారత అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన హిందీ చిత్రం భాగ్ మిల్కా భాగ్ అవార్డుల పంట పండించింది. ఏకంగా ఆరు ఫిలింఫేర్ అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు కేటగిరీల్లో ఈ సినిమా అవార్డులను దక్కించుకుంది.
 
ఫర్హాన్ అక్తర్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది. మిల్కా సింగ్ పాత్రను ఫర్హాన్ పోషించారు. ఉత్తమ గీత రచయితగా ప్రసూన్ జోషి, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా డోలీ అహ్లువాలియా ఎంపికయ్యారు. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీలో భాగ్ మిల్కా భాగ్ చిత్రం అవార్డు సొంతం చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement