మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్: సంతోష్ | Murugadoss, Mahesh Babu to join hands next year | Sakshi
Sakshi News home page

మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్: సంతోష్

Nov 26 2015 12:08 PM | Updated on Sep 3 2017 1:04 PM

మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్: సంతోష్

మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్: సంతోష్

ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు ఓ చిత్రం చేయనున్నారు.

చెన్నై : ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు ఓ చిత్రం చేయనున్నారు. ఆ చిత్రం 2016లో షూటింగ్ జరుపుకోనుంది. ఈ మేరకు ప్రముఖ ఛాయగ్రాహకుడు సంతోష్ శివన్ గురువారం ట్విట్టర్లో వెల్లడించారు.  ఇప్పటికే ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు హరీశ్ జైరాజ్ సంగీతాన్ని అందించనున్నారు.

అయితే ఇదే చిత్రాన్ని తమిళంలో విజయతో చిత్రీకరించనున్నారని సమాచారం. మురుగుదాస్ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ గతంలో రెండు చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం మురుగదాస్...  సోనాక్షి సిన్హా నటిస్తున్న అకీరాతో  బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్దం తర్వాత మురుగుదాస్ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement