షారుక్పై ముంబై మాఫియా గురి? | mumbai mafia now targets shah rukh khan | Sakshi
Sakshi News home page

షారుక్పై ముంబై మాఫియా గురి?

Aug 26 2014 12:45 PM | Updated on Sep 2 2017 12:29 PM

షారుక్పై ముంబై మాఫియా గురి?

షారుక్పై ముంబై మాఫియా గురి?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్కు ముంబైలోని అండర్ వరల్డ్ మాఫియా నుంచి ముప్పు పొంచి ఉందా? షారుక్తో మాట్లాడేందుకు రవి పూజారి ప్రయత్నించాడా?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్కు ముంబైలోని అండర్ వరల్డ్ మాఫియా నుంచి ముప్పు పొంచి ఉందా? షారుక్తో మాట్లాడేందుకు రవి పూజారి ప్రయత్నించాడా? సరిగ్గా ఇలాంటి అనుమానాలే ముంబై పోలీసులకు కూడా వచ్చాయి. దాంతో సూపర్స్టార్కు భద్రత మరింత పటిష్ఠం చేయాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. సోమవారం మధ్యాహ్నమే షారుక్తో మాట్లాడేందుకు రవిపూజారి ప్రయత్నించినట్లు సమాచారం. దాంతో ముందు జాగ్రత్త చర్యగా షారుక్ భద్రత పెంచారు.

బాలీవుడ్ నిర్మాత అలీ మొరానీ ఇంటివద్ద ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఇటీవలే ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. షారుక్ ఖాన్కు అలీ మొరానీ చాలా సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి కూడా. కొన్ని రోజుల క్రితమే తనకు పెద్దమొత్తంలో డబ్బులు పంపాలంటూ అలీ మొరానీకి రవి పూజారి నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చినా, ఆయన వాటిని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో భయపెట్టేందుకు కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఇప్పుడు ఆయనకు సన్నిహితుడైన షారుక్పై కూడా రవిపూజారి కన్ను పడిందని చెబుతున్నారు. షారుక్ ప్రస్తుతం 'హేపీ న్యూ ఇయర్' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement