
రూ. 200 కోట్ల కలెక్షన్లు వచ్చాయి
బాలీవుడ్ చిత్రం ఎంఎస్ ధోనీ-ద అన్టోల్డ్ స్టోరీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
ముంబై: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ఎంఎస్ ధోనీ-ద అన్టోల్డ్ స్టోరీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 204 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించినట్టు నిర్మాతలు చెప్పారు.
భారత్లో 175.7 కోట్లు, విదేశాల్లో 29 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు నిర్మాతలు తెలిపారు. బయోపిక్ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్గా, ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సుల్తాన్ తర్వాత అత్యధిక వీకెండ్ కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా ఎంఎస్ ధోనీ నిలిచింది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుషాంత్ సింగ్ రాజ్పుట్ టైటిల్ రోల్లో నటించాడు.