breaking news
Rs 200 crores
-
రూ. 200 కోట్ల కలెక్షన్లు వచ్చాయి
ముంబై: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ఎంఎస్ ధోనీ-ద అన్‌టోల్డ్ స్టోరీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 204 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించినట్టు నిర్మాతలు చెప్పారు. భారత్‌లో 175.7 కోట్లు, విదేశాల్లో 29 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు నిర్మాతలు తెలిపారు. బయోపిక్ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా, ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సుల్తాన్ తర్వాత అత్యధిక వీకెండ్ కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా ఎంఎస్ ధోనీ నిలిచింది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుషాంత్ సింగ్ రాజ్పుట్ టైటిల్ రోల్లో నటించాడు. -
రూ. 200 కోట్లు ఇస్తామన్నా ‘ఐడియా’ ఇవ్వనన్నాడు!
న్యూయార్క్: ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఐడియా విలువ అంత గొప్పది మరి. అదే అమెరికాలో అయితే ఐడియా విలువ సుమారు 200 కోట్ల రూపాయలకు పైమాటే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ స్కూల్ కుర్రాడు రూ. 200 కోట్లు ఇస్తామని చెప్పినా తన ‘ఐడియా’ను ఇవ్వనని చెప్పేశాడు. ఇంతకీ ఆ కుర్రాడెవరు? అతని ఐడియా ఏంటి? అనే వివరాల్లోకెళ్తే.... టేలర్ రోసెంథాల్.. 14 ఏళ్ల కుర్రాడు. అమెరికాలోని ఆల్బామాలో జరిగే బేస్‌బాల్ టోర్నమెంట్స్‌కు తప్పనిసరిగా హాజరయ్యేవాడు. అయితే మ్యాచ్ జరిగిన ప్రతిసారీ తన స్నేహితులు గాయపడడం, ఆ గాయాలకు కట్లు కట్టేందుకు బ్యాండెయిడ్ల కోసం వారి తల్లిదండ్రులు మెడికల్ షాపులకు పరుగులు తీయడం గమనించాడు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని నిర్ణయించుకొని ఓ వెండింగ్ మిషన్ (ఏటీఎం లాంటిది)ను తయారుచేశాడు. మీట నొక్కితే ఫస్ట్‌ఎయిడ్ కిట్ అందులో నుంచి బయటకు వచ్చేలా చేశాడు. గాయాలు, కోతలు, ఎండకు శరీరం బొబ్బలెక్కడం వంటి వాటికి వేర్వేరు ఫస్ట్‌ఎయిడ్ కిట్‌ను వెండింగ్ మిషన్‌లో ముందుగానే సిద్ధంగా ఉంచాడు. సమస్యను సెలెక్ట్ చేసుకొని, మీట నొక్కితే దానికి సంబంధించిన ఫస్ట్‌ఎయిడ్ కిట్ బయటకు వచ్చేలా చేసిన ఈ ఆలోచన టేలర్‌కు ఎంతగానో పేరు తెచ్చింది. ఇంకేముంది ఆ ఆలోచనకు సంబంధించిన అన్ని హక్కులను తనపేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా రెక్మెడ్ పేరుతో ఓ స్టార్టప్(అంకుర సంస్థ)ను కూడా ప్రారంభించాడు. ఇప్పటికే కోట్లాది రూపాయల ఆర్డర్స్.. ఈ విషయాన్ని తెలుసుకున్న ఓ మల్టీనేషనల్ హెల్త్‌కేర్ సంస్థ ‘ఐడియా’ను అమ్మాల్సిందిగా టేలర్‌ను కోరింది. అందుకు ప్రతిఫలంగా రూ. 200 కోట్లు చెల్లిస్తామంటూ ఆఫర్ చేసింది. అందుకు టే లర్ ససేమిరా అన్నాడు. తానే స్వయంగా మరిన్ని యంత్రాలు తయారు చేసి విక్రయిస్తానని చెబుతున్నాడు. ఒక్కో మిషన్ రూ. 35 లక్షల చొప్పున విక్రయించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడని, ఇప్పటికే 100 మిషన్ల కోసం ఆర్డర్లు కూడా వచ్చాయని టేలర్ టీచర్ క్లారిండా జోన్స్ తెలిపారు.