జపనీస్ - అమెరికన్ టీవీ షోలో ఇర్ఫాన్? | most wanted actor in bollywood | Sakshi
Sakshi News home page

జపనీస్ - అమెరికన్ టీవీ షోలో ఇర్ఫాన్?

Aug 8 2015 12:11 AM | Updated on Apr 3 2019 6:23 PM

జపనీస్ - అమెరికన్ టీవీ షోలో ఇర్ఫాన్? - Sakshi

జపనీస్ - అమెరికన్ టీవీ షోలో ఇర్ఫాన్?

ఇర్ఫాన్ ఖాన్... ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్‌లలో మోస్ట్ వాంటెడ్ యాక్టర్.

ఇర్ఫాన్ ఖాన్... ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్‌లలో మోస్ట్ వాంటెడ్ యాక్టర్. ఓ పక్క బాలీవుడ్ చిత్రాల్లో నటి స్తూనే, హాలీవుడ్‌లో కూడా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ అక్కడ కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. ఆయన ఇప్పుడు ఎంత బిజీ అంటే.... తాను నటించిన చిత్రాల ప్రచారానికే సమయం కేటాయించలేని పరిస్థితిలో ఉన్నారు. సినిమాలతో బిజీగా ఉన్న ఇర్ఫాన్‌ఖాన్‌కు జపాన్-అమెరికా దేశాలు జాయింట్ వెంచర్‌గా రూపొందించనున్న ఓ టీవీ షోలో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. ఆ షో ప్రతినిధులు ఇర్ఫాన్‌కు ఇటీవలే స్క్రిప్ట్ వినిపించారట.

ఆ స్క్రిప్ట్, పాత్ర నచ్చడంతో మరో ఆలోచనకు తావు ఇవ్వకుండా ఇర్ఫాన్ ఖాన్ ఆ షోలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కే ఈ ధారావాహికలో ఇర్ఫాన్‌ది చాలా కీలకమైన పాత్ర అని బోగట్టా.

Advertisement
 
Advertisement
Advertisement