మోస్ట్ వాంటెడ్! | Most Wanted | Sakshi
Sakshi News home page

మోస్ట్ వాంటెడ్!

Jun 4 2015 11:42 PM | Updated on Sep 3 2017 3:13 AM

మోస్ట్ వాంటెడ్!

మోస్ట్ వాంటెడ్!

తెలుగు తెరపై పరభాషా ప్రతినాయకుల జోరు ఎక్కువైంది. ఇది సహాయ నటులకు కూడా వర్తిస్తుం దనే చెప్పాలి.

 తెలుగు తెరపై పరభాషా ప్రతినాయకుల జోరు ఎక్కువైంది. ఇది సహాయ నటులకు కూడా వర్తిస్తుం దనే చెప్పాలి. ముఖ్యంగా తమిళ పరిశ్రమ నుంచి నాజర్ ఎక్కువగా తెలుగు చిత్రాల్లో నటిస్తుంటారు. తాజాగా, సత్యరాజ్ హవా కూడా మొదలైంది. గోపీచంద్ హీరోగా నటించిన ‘శంఖం’ సినిమా తెలుగులో సత్యరాజ్‌కి తొలి స్ట్రయిట్ మూవీ. ఆ తర్వాత వచ్చిన ‘మిర్చి’తో సత్యరాజ్ ఇక్కడ ‘మోస్ట్ వాంటెడ్ కేరెక్టర్ ఆర్టిస్ట్’ అయ్యారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ‘బాహుబలి’ చిత్రంలో ‘కట్టప్ప’ పాత్ర పోషిస్తున్నారు. మహేశ్‌బాబు హీరోగా నటించనున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో కూడా నటించనున్నారు. ఇవే కాకుండా సత్యరాజ్‌కి తెలుగులో మరిన్ని భారీ ఆఫర్లు ఉన్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement