బాలయ్య వారసుడి ఎంట్రీ..? | mokshagna to act with balakrishna in adithya 999 | Sakshi
Sakshi News home page

బాలయ్య వారసుడి ఎంట్రీ..?

Jan 7 2016 11:34 AM | Updated on Aug 29 2018 1:59 PM

బాలయ్య వారసుడి ఎంట్రీ..? - Sakshi

బాలయ్య వారసుడి ఎంట్రీ..?

టాలీవుడ్లో స్టార్ వారసుల ఎంట్రీకి యమా క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కుంటుంబాల నుంచి వచ్చే స్టార్ వారసుల రాక కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తుంటారు.

టాలీవుడ్లో స్టార్ వారసుల ఎంట్రీకి యమా క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కుంటుంబాల నుంచి వచ్చే స్టార్ వారసుల రాక కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు. అలా ఇండస్ట్రీ వర్గాల చాలారోజులుగా ఎదురుచూస్తున్న స్టార్ వారసుడు నందమూరి మోక్షజ్ఞ. బాలకృష్ణ నట వారసుడిగా ఎంట్రీకి రెడీ అవుతున్న మోక్షజ్ఞ తెరగేంట్రంపై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో తన 99వ సినిమా డిక్టేటర్ను పూర్తిచేసిన నందమూరి బాలకృష్ణ, తన 100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు దర్శకుడిగా బోయపాటి శ్రీనును ఎనౌన్స్ చేసినా ఇంకా ప్రాజెక్ట్ మాత్రం కన్ఫామ్ కాలేదు. అయితే అదే సమయంలో సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వల్గా ఆదిత్య 999ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే సింగీతం కథ కూడా రెడీ చేశారన్న టాక్ వినిపిస్తోంది.

సైన్స్ ఫిక్షన్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కీలక సన్నివేశంలో ఓ యువరాజు పాత్ర కనిపిస్తుందట. ఆ పాత్రను బాలయ్య వారసుడు మోక్షజ్ఞతో చేయించాలని భావిస్తున్నాడు దర్శకుడు సింగీతం శ్రీనివాస్. అయితే ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీపై దృష్టిపెట్టిన నందమూరి ఫ్యామిలీ, ఈ విషయం పై కూడా ఆలోచిస్తోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీపై ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు ఫ్యాన్స్.

Advertisement
 
Advertisement
Advertisement