టాలీవుడ్ హీరో బాలకృష్ణ గాయపడ్డారు. ఆయన హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్ట్‌లో జరుగుతోంది. అక్కడ మంచు మనోజ్, బాలకృష్ణ మధ్య కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో టీమ్.. బాలకృష్ణని ఆస్పత్రికి తరలించారు. మోకాలికి గాయమైననట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కాకినాడ పోర్ట్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
‘వీర సింహారెడ్డి’ విజయం తర్వాత గోపిచంద్ మలినేని - బాలయ్య నుంచి వస్తున్న రెండో చిత్రమిది. ఇందులో బాలయ్య గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. హీరోయిన్‌గా కాజల్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.


