వాట్సప్‌తో కటీఫ్‌

mohanlal stops using whatsapp - Sakshi

ఇంట్లో వాళ్లు, ఫ్రెండ్స్‌ ఎప్పుడు టచ్‌లో ఉండాలన్నా.. ఆఫీస్‌ పనులు అన్నింటికీ టచ్‌లో ఉండాలన్నా సులువైన మార్గం వాట్సప్‌. ‘‘అన్ని పనులకు దగ్గరగా ఉంటున్న ఈ యాప్‌కు దూరంగా ఉంటున్నాను’’ అన్నారు మలయాళ నటుడు మోహన్‌లాల్‌.  ఈ విషయం గురించి మోహన్‌లాల్‌ మాట్లాడుతూ – ‘‘ఉదయం లేవగానే ప్రేయర్‌ చేయడం నాకు అలవాటు. ఈ మధ్య ఫోన్‌ చూడటం అలవాటైంది. కొన్ని వీడియోలు, ఫొటోలు డిస్ట్రబ్‌ చేస్తున్నాయి. అలాగే ప్రయాణాల్లో కారు కిటికిలో నుంచి చెట్లు, బిల్డింగ్‌లను గమనిస్తూ ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు ఫోన్‌లోనే ఉంటున్నాను.

ఎయిర్‌పోర్ట్‌లో కొత్త స్నేహితులను కలవడం, వాళ్లతో కబుర్లు చెప్పడం వంటి వాటికి ఫుల్‌స్టాప్‌ పడింది. అందుకే వాట్సప్‌కు బైబై చెప్పాను. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఉదయాన్నే మళ్లీ న్యూస్‌పేపర్‌తో రోజుని మొదలుపెడుతున్నాను. సగం చదివిన పుస్తకాల్ని పూర్తి చేస్తున్నాను. నా ఆలోచనల్ని విశ్లేషించుకోవడానికి చాలా సమయం దొరుకుతోంది. పనిలో ఉన్నప్పుడు కొన్ని వీడియోలు నెగటివ్‌ ఇంపాక్ట్‌ చూపించేవి. అలాగే ప్రేమను పంచుకోవడానికి మెయిల్స్‌ కూడా ఉన్నాయి. వాట్సప్‌కి దూరంగా ఉండమని నాతో ఎవరూ అనలేదు. మిగతా వాళ్లను కూడా అలా చేయమని అనడం లేదు’’ అని పేర్కొన్నారాయన. ప్రస్తుతం ‘మరక్కార్‌’ అనే పీరియాడికల్‌ భారీ బడ్జెట్‌ చిత్రంలో  నటిస్తున్నారు మోహన్‌లాల్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top