‘మాకు దెయ్యంగా కనిపించేది మీకు గొప్పగా కనిపిస్తుందా’

Mohanlal Lucifer Under Fire for Hurting Christian Values - Sakshi

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ తాజా చిత్రం ‘లూసిఫెర్’ వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రంలో క్రైస్తవుల మనోభావాలను దెబ్బ తీశారని.. చర్చి విలువలను కించపరిచారంటూ క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ కేరళ ఆధ్వర్యంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు వారు ఫేస్‌బుక్‌ ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం లూసిఫెర్. అయితే ఈ  పేరును క్రైస్తవులు సాతానుగా నమ్ముతారని.. కానీ ఈ చిత్రంలో అందుకు విరుద్ధంగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సదరు ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ‘చర్చి ఔన్నత్యాన్ని, క్రైస్తవ విలువలను, మత కర్మలను దూషిస్తూ.. సాతాను పేరును స్తుతిస్తున్నారు. దీన్ని బట్టి మలయాళ చిత్ర పరిశ్రమలో ఎంతటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయో అర్థం అవుతుంద’ని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ను ఇప్పటకే వేల మంది లైక్‌ చేయడమే కాక ‘‘లూసిఫెర్‌’ను క్రిస్టియన్లు సాతానుగా భావిస్తారు’ అని కామెంట్‌ చేస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన లూసిఫెర్ చిత్రం గురువారం విడుదలయ్యిది. హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తొలిసారి దర్శకత్వ వహించిన ఈ చిత్రం ఇప్పటికే పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకోవడమే కాక సమ్మర్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలుస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top