జయసుధకు మోహన్ బాబు మద్దతు | mohan babu supports jayasudha | Sakshi
Sakshi News home page

జయసుధకు మోహన్ బాబు మద్దతు

Mar 25 2015 7:18 PM | Updated on Sep 2 2017 11:22 PM

జయసుధకు మోహన్ బాబు మద్దతు

జయసుధకు మోహన్ బాబు మద్దతు

మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికల్లో జయసుధ ప్యానల్ కు మోహన్ బాబు మద్దతు ప్రకటించారు.

హైదరాబాద్: మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికల్లో జయసుధ ప్యానల్ కు మోహన్ బాబు మద్దతు ప్రకటించారు. తనకు కంటే సీనియర్ నటి అయిన జయసుధ 'మా' అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండడం శుభపరిణామని ట్విటర్ లో పేర్కొన్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జయసుధను అందరూ ప్రోత్సహించాలని కోరారు. ఆమెను విమర్శించే బదులు మద్దతు పలకాలని సూచించారు. జయసుధకు మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు.

'మా' ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తన కుమార్తె మంచు లక్ష్మికి మోహన్ బాబు అభినందనలు తెలిపారు. ఇది తమకు దక్కిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. 'మా' అధ్యక్ష ఎన్నికల్లో జయసుధకు పోటీగా రాజేంద్రప్రసాద్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement