కామెడీ మిఠాయి | MITHAI Movie Launch | Sakshi
Sakshi News home page

కామెడీ మిఠాయి

Jan 21 2018 1:21 AM | Updated on Jan 21 2018 1:21 AM

MITHAI Movie Launch - Sakshi

గాయత్రి గుప్తా, శ్వేతా వర్మ, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య తారలుగా  స్వీయ దర్శకత్వంలో ప్రశాంత్‌కుమార్‌ రూపొందిస్తున్న ‘మిఠాయి’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో విజయ్‌ దేవరకొండ, క్రాంతి మాధవ్, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. ‘‘డిఫరెంట్‌ కథ. తెలుగులో డార్క్‌ కామెడీ నేపథ్యంలో వస్తున్న చిత్రమిది’’ అన్నారు సందీప్‌ రెడ్డి.

‘‘డార్క్‌ కామెడీ మూవీ అనగానే క్యూరీయాసిటీతో వెయిట్‌ చేస్తున్నాం. ప్రశాంత్‌ నాకు మంచి ఫ్రెండ్‌’’ అన్నారు విజయ్‌ దేవరకొండ. ‘‘మంచి టీమ్‌ చేస్తున్న సినిమా. అందరికీ నచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు ప్రశాంత్‌ కుమార్‌. ప్రియదర్శి, భూషణ్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ సాగర్, ఎగ్జిక్యూ టివ్‌ ప్రొడ్యూసర్‌: కృష్ణ వొడవల్లి.

Advertisement
 
Advertisement
Advertisement