సల్మాన్ ఖాన్ ను కలుసుకోనున్న మిస్ యూనివర్స్! | Miss Universe Olivia Culpo to meet Salman Khan | Sakshi
Sakshi News home page

సల్మాన్ ఖాన్ ను కలుసుకోనున్న మిస్ యూనివర్స్!

Sep 27 2013 7:19 PM | Updated on Sep 1 2017 11:06 PM

సల్మాన్ ఖాన్ ను కలుసుకోనున్న మిస్ యూనివర్స్!

సల్మాన్ ఖాన్ ను కలుసుకోనున్న మిస్ యూనివర్స్!

మిస్ యూనివర్స్ 2012 ఓలివియా కల్పో శుక్రవారం భారత పర్యటనను ప్రారంభించారు

మిస్ యూనివర్స్ 2012 ఓలివియా కల్పో శుక్రవారం భారత పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో బాలికల సంక్షేమం కోసం నిధులను సేకరించేందుకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను కూడా కలువనున్నారు. భారత పర్యటనలో ఓలివియా వెంట డిజైనర్ సంజనా ఉంటారు. బాలికల సంక్షేమం, మహిళపై లైంగిక వేధింపుల వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది అని అన్నారు.

బాలికల సంక్షేమం కోసం నిధుల సేకరణ కోసం ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో సల్మాన్ ఖాన్ తోపాటు లతా మంగేష్కర్, సంగీత దర్శకులు సాజిద్, వాజిద్ లు కూడా పాల్గొంటారని నిర్వహకులు తెలిపారు. ఈపర్యటనలో భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరిస్తారని డిజైనర్ సంజనా తెలిపారు. అంతేకాక బాలీవుడ్ అంటే ఓలివియాకు ప్రత్యేక అభిమానం. పరిస్థితులు అనుకూలిస్తే.. సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేసే అవకాశం ఉంది అని సంజనా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement