మెట్‌ గాలా: అదరగొట్టిన ప్రియాంక | Met Gala 2018: The Internet Gives Priyanka Chopra Perfect, Deepika Padukone | Sakshi
Sakshi News home page

మెట్‌ గాలా: అదరగొట్టిన ప్రియాంక

May 8 2018 6:40 PM | Updated on Apr 3 2019 6:34 PM

Met Gala 2018: The Internet Gives Priyanka Chopra Perfect, Deepika Padukone - Sakshi

న్యూయార్క్‌: న్యూయార్క్‌లో జరిగిన మెట్‌గాలా ఈవెంట్‌లో  బాలీవుడ్‌ స్టార్‌  బ్యూటీలు సందడి చేశారు.  ముఖ్యంగా  బాలీవుడ్‌ భామలు ఎలిగెంట్‌ దుస్తుల్లో బంగారు ఆభరణాల్లో రెడ్‌ కార్పెట్‌ పై  మెరిసిపోయారు.  సోమవారం జ‌రిగిన ఈ మెగా ఈవెంట్‌లో  బాలీవుడ్‌ బ్యూటీలు ప్రియాంకచోప్రా, దీపికా పదుకోన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.   దీంతో ఫోటోగ్రాఫర్లు  తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీపడటంలో ఆశ్చర్యం ఏముంది.  ఇపుడు వీరిద్దరి ఫోటోలు సోషల్‌ మీడియాలో  చక‍్కర్లుకొడుతున్నాయి.  

న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌, కాస్ట్యూమ్‌ ఇన్‌స్టిట్యూట్ ప్రతి ఏటా ‘మెట్‌ గాలా’పేరుతో ఈవెంట్ నిర్వహించడం ఆనవాయితీ. ఈవెంట్ ద్వారా వచ్చే విరాళాలను ఛారిటీలకు వినియోగిస్తారు.  ఈ సంవత్సరం - "హెవెన్లీ బాడీస్: ఫ్యాషన్  అండ్‌ కాథలిక్ ఇమాజినేషన్’’ థీమ్‌తో నిర్వహించారు.  హర్పెర్స్ బజార్ అత్యుత్తమ దుస్తుల జాబితాలో టాప్‌లో నిలవగా, ప్రియాంకా చోప్రా  17స్థానాన్ని దక్కించుకుంది.  అయితే  ఈసారి కూడా దీపికి పదుకోన్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.  హాలీవుడ్‌లో కూడా తన ప్రత్యేకతను  చాటుకుంటున్న ప్రియాంకచోప్రా‌,  బాలీవుడ్‌స్టార్‌ హీరోయిన్‌ దీపికాను  ఈ ఈవెంట్‌కు  ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement