‘మెర్సల్‌’ రీమేక్‌పై నిర్మాతల క్లారిటీ | Mersal Makers deny rumours about Telugu remake | Sakshi
Sakshi News home page

‘మెర్సల్‌’ రీమేక్‌పై నిర్మాతల క్లారిటీ

Nov 2 2017 2:31 PM | Updated on Nov 2 2017 2:31 PM

Mersal Makers deny rumours about Telugu remake - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ హీరోగా రూపొందిన సూపర్‌ హిట్‌ సినిమా మెర్సల్‌. విజయ్‌ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు ఇళయదళపతి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికేఈ  సినిమా 200 కోట్లకు పైగా  గ్రాస్‌ సాధించినట్టుగా చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ వర్షన్‌ మాత్రం​ రిలీజ్‌కు నోచుకోలేదు.

తెలుగులో మెర్సల్‌ను అదిరింది పేరుతో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేశారు. అయితే సెన్సార్‌ సమస్యల కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. దీంతో ఇక అదిరింది రిలీజ్‌ కాదన్న ప్రచారం కూడా జరిగింది. అదే సమయంలో మెర్సల్‌ రీమేక్‌ హక్కులను అల్లు అరవింద్‌ తీసుకున్నారని ఈ సినిమాను పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రీమేక్‌ చేయనున్నారన్న టాక్‌ వినిపించింది. అయితే వార్తలపై చిత్రయూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. మెర్సల్‌ రీమేక్‌ హక్కులను ఎవరికీ ఇవ్వలేదన్న శ్రీ తేనండాల్ స్టూడియోస్‌, త్వరలోనే అదిరింది రిలీజ్‌ అవుతుందని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement