మౌత్‌ పబ్లిసిటీ ఇవ్వండి చాలు!

Mental Madhilo movie song release - Sakshi

శ్రీ విష్ణు, నివేతా పెతురాజ్‌ జంటగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్‌ పతాకంపై రాజ్‌ కందుకూరి నిర్మించిన సినిమా ‘మెంటల్‌ మదిలో’. ప్రముఖ నిర్మాత డి. సురేశ్‌బాబు చిత్రసమర్పకులు. ఈ నెల 24న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినిమాలోని నాలుగో పాట ‘ఏదేలా ఏదోలా’ను విడుదల చేసిన డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘చాలా మంది తమ సినిమా బాగుంది చూడమని ప్రెస్‌మీట్స్‌లో చెప్తుంటారు. మా సినిమా ప్రివ్యూలు వేస్తాం. చూడండి... నచ్చితే మౌత్‌ పబ్లిసిటీ ఇవ్వండి. మాకది చాలు’’అన్నారు.

‘‘కన్‌ఫ్యూజన్‌లో ఉన్న ఓ అబ్బాయి కథే ఈ సినిమా. సురేశ్‌బాబుగారికి నచ్చడంతో విడుదల చేయాడానికి ముందుకొచ్చారు. ఈ నెల 20న ప్రీ–రిలీజ్‌ వేడుకను నిర్వహిస్తున్నాం. శ్రీవిష్ణు, నివేతా బాగా నటించారు. వివేక్‌ సినిమాను చక్కగా తెరకెక్కించాడు. ప్రశాంత్‌ మంచి పాటలు అందించారు’’ అన్నారు రాజ్‌ కందుకూరి. ‘‘యంగ్‌ అండ్‌ ఫ్రెష్‌ టీమ్‌ కలిసి పని చేసిన సినిమా ఇది. సురేశ్‌బాబుగారు అండగా నిలవడం ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రీవిష్ణు. చిత్రదర్శకుడు వివేక్, హీరోయిన్‌ నివేతా పేతురాజ్, నటుడు కిరిటీ దామరాజు, సంగీత దర్శకుడు ప్రశాంత్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top