'మెంటల్ మదిలో...' మూవీ రివ్యూ | Sakshi
Sakshi News home page

'మెంటల్ మదిలో...' మూవీ రివ్యూ

Published Wed, Nov 22 2017 10:23 AM

Mental Madhilo movie review - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

టైటిల్           : మెంటల్ మదిలో...
జానర్          : రొమాంటిక్ ఎంటర్ టైనర్
తారాగణం    : శ్రీ విష్ణు, నివేథ పెతురాజ్, శివాజీ రాజా
సంగీతం       : ప్రశాంత్ ఆర్ విహారి
దర్శకత్వం   : వివేక్ ఆత్రేయ
నిర్మాత        : రాజ్ కందుకూరి


పెళ్లిచూపులు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ శ్రీ విష్ణు హీరోగా మెంటల్ మదిలో సినిమాను తెరకెక్కించారు. సపోర్టింగ్ రోల్స్ లో మంచి ఇమేజ్ సంపాదించిన శ్రీ విష్ణు, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాతో హీరోగా తొలి విజయాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు సోలో హీరోగా మెంటల్ మదిలో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. సినిమాలోని కంటెంట్ నచ్చిన సురేష్ బాబు.. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ తొలిసారిగా డైరెక్ట్ చేసిన మెంటల్ మదిలో.. మరోసారి రాజ్ కందుకూరికి సక్సెస్ అందించిందా? శ్రీవిష్ణు సోలో హీరోగా ఆకట్టుకున్నాడా..?

కథ :
అరవింద్ కృష్ణ (శ్రీ విష్ణు) ఏ విషయంలోనూ సొంతంగా నిర్ణయం తీసుకోలేని గందరగోళ మనస్తత్వం కలిగిన వ్యక్తి. కనీసం ఏ షర్ట్ వేసుకోవాలో కూడా సొంతంగా నిర్ణయం తీసుకోలేడు. అందుకే చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనూ ఆప్షన్స్ తీసుకోవడానికి ఇష్టపడడు. అంతేకాదు చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన కారణంగా అమ్మాయిలంటే కూడా అరవింద్ కు భయం కలుగుతుంది. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరినా అమ్మాయిలతో మాత్రం మాట్లాడడు. పెళ్లి చేస్తే ఏమైన మార్పు వస్తుందని భావించిన అరవింద్ తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుంటారు. (సాక్షి రివ్యూస్)డజనుకు పైగా పెళ్లిచూపులు చూసినా అరవింద్ ప్రవర్తన కారణంగా ఒక్కటి కూడా సెట్ కాదు. చివరకు స్వేచ్ఛ (నివేథ పెతురాజ్), అరవింద్ తో పెళ్లికి ఓకె చెపుతుంది.

అరవింద్ కూడా తొలి చూపులోనే స్వేచ్ఛతో ప్రేమలో పడతాడు. తనతో పరిచయం అయిన తరువాత అరవింద్ ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో వీరి ఎంగేజ్ మెంట్ వాయిదా పడుతుంది. అదే సమయంలో అరవింద్ ఆఫీస్ పనిమీద ముంబై వెళ్లాల్సి వస్తుంది. అయిష్టంగానే ముంబై వెళ్లిన అరవింద్, కొద్ది రోజులు తరువాత స్వేచ్ఛకు ఫోన్ చేసి ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్తాడు. అరవింద్ ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి..? ముంబైలో ఏం జరిగింది..? చివరకు అరవింద్, స్వేచ్ఛలు ఒక్కటయ్యారా అన్నదే మిగతా కథ.

నటీనటులు :
అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో సీరియస్ రోల్ లో కనిపించిన శ్రీ విష్ణు, మెంటల్ మదిలో లవర్ బాయ్ లుక్స్ లో అదరగొట్టాడు. సొంతంగా నిర్ణయం తీసుకోలేని గందరగోళ మనస్తత్వం ఉన్న వ్యక్తిగా మంచి నటన కనబరిచాడు. ఫస్ట్ హాఫ్ అంతా అమాయకుడిగా కనిపించిన శ్రీవిష్ణు, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ హీరోయిన్ గా నటించిన నివేథ పెతురాజ్, లుక్స్ తో పాటు నటనతోను స్వేచ్ఛపాత్రకు ప్రాణం పోసింది నివేథ.  (సాక్షి రివ్యూస్)మరో కీలక పాత్రలో నటించిన రేణు, కథను మలుపు తిప్పే పాత్రలో ఆకట్టుకుంది. బబ్లీగా కనిపిస్తూనే మంచి ఎమోషన్స్ పండించింది. చాలా కాలం తరువాత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించిని సీనియర్ నటుడు శివాజీ రాజా మిడిల్ క్లాస్ తండ్రిగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ :
పెళ్లిచూపులు లాంటి క్లాస్ ఎంటర్ టైనర్ తో ఆకట్టుకున్న రాజ్ కందుకూరి మరోసారి అలాంటి అందమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకోలేని వ్యక్తి, తన సమస్య కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ప్రేమ విషయంలో ఎలాంటి మానసిక సంఘర్షణకు గురయ్యాడో ఎంటర్ టైనింగ్ గా చూపించారు. తొలి సినిమానే అయినా.. దర్శకుడు వివేక్ ఆత్రేయ కథను చాలా బాగా డీల్ చేశాడు. కథనంలో కాస్త వేగం తగ్గినా ఓ అందమైన ప్రేమకథను చూస్తున్న ఫీల్ కలిగించటంలో సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా దర్శకుడు ఎంచుకున్న టీం సినిమా అంత బాగా రావడానికి హెల్ప్ అయ్యింది. (సాక్షి రివ్యూస్) తొలి చిత్రమే అయినా సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి తన మార్క్ చూపించాడు. మనసును తాకే మెలోడీస్ తో పాటు అద్భుతమైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. కమర్షియల్ మూసలో కాకుండా ఇలాంటి డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్న రాజ్ కందుకూరి ప్రయత్నాన్ని సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. కథ ఎంపికలో ఆయన చూపిస్తున్న కొత్తదనం ఎంతో మంది కొత్త సాంకేతిక నిపుణులకు ప్రొత్సాహాన్ని ఇస్తుందంటున్నారు.

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Advertisement
Advertisement